మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ రోల్స్ అలాగే సెకండ్ హీరోగా చేసేవారు. అటు తర్వాత హీరోగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఆయనకు స్టార్ స్టేటస్ ను తెచ్చి పెట్టిన సినిమా మాత్రం ‘ఖైదీ’ అనే చెప్పాలి. 1983 వ సంవత్సరంలో అక్టోబర్ 28న ఈ చిత్రం విడుదలయ్యింది. కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అయితే ఈ చిత్రానికి హీరోగా ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి కాదు సూపర్ స్టార్ కృష్ణ గారు..! మొదట ఈ ప్రాజెక్టు ఆయన చేయాల్సి ఉంది.. కానీ ముందుగా ఆయన వేరే నిర్మాతతో సినిమా చేయడానికి సైన్ చేశారు.
దాంతో ‘ఖైదీ’ ని ఆ నిర్మాతతో చేద్దాం అని ప్రయత్నాలు చేసినా.. అందుకు ఆ నిర్మాత ఒప్పుకోలేదు. ఆ కారణంగానే కృష్ణ గారు ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడం జరిగింది. దాంతో చిరు వచ్చి చేరారు. అలా కృష్ణ గారు తప్పుకోవడం వలన చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి ‘ఖైదీ’ సాయం చేసింది. ఇక కృష్ణ గారు రిజెక్ట్ చేసిన మరో సినిమా ‘కలియుగ పాండవులు’. కె.రాఘవేంద్ర రావు గారు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం చేయాల్సిన టైం లో కృష్ణ గారు మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
దాంతో వెంకటేష్ ని హీరోగా లాంచ్ చేయమని రామానాయుడు గారికి సలహా ఇచ్చింది కూడా కృష్ణగారే..! అలా అది వెంకటేష్ చేయడం ..1986 వ సంవత్సరం ఆగష్టు 14 న విడుదలైన ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో వెంకటేష్ హీరోగా నిలదొక్కుకున్నారు.. అటు తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు.