ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన కృష్ణంరాజు మరణవార్త సినీ అభిమానులను షాక్ కు గురి చేసిందనే సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు చిరంజీవి కృష్ణంరాజు మరణవార్త గురించి స్పందిస్తూ కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం అని చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు గారు సినిమా ఇండస్ట్రీలో పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించారని మనవూరి పాండవులు సినిమా నుంచి ఇప్పటివరకు ఆయనతో ఉన్న అనుబంధం ఆత్మీయమైనదని చిరంజీవి అన్నారు. రెబల్ స్టార్ కు అసలైన నిర్వచనం కృష్ణంరాజు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలందించారని చిరంజీవి కామెంట్లు చేశారు. కృష్ణంరాజు గారు లేని లోటు సినిమా ఇండస్ట్రీకి, లక్షలాది మంది ఫ్యాన్స్ కు ఎప్పటికీ తీరనిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కృష్ణంరాజు ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నానని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో కృష్ణంరాజు మాట్లాడుతూ చిరంజీవితో తనకున్న స్నేహం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో డ్యాన్స్ బాగా చేసేవాడని ఆ సమయంలో చిరంజీవి ఎత్తుకు ఎదుగుతాడని చెప్పానని ఆయన తెలిపారు.
ఒకసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకకు వెళ్లానని నేను లండన్ నుంచి తెప్పించిన కెమెరాతో నా మేనల్లుడు చిరంజీవి ఫోటోలను తీస్తున్నాడని కృష్ణంరాజు తెలిపారు. ఆ సమయంలో చిరంజీవి కెమెరా గురించి వివరాలు అడగగా కృష్ణంరాజు ఆ కెమెరాను చిరంజీవికి బహుమతిగా ఇచ్చేశారు. అప్పట్లోనే లక్షల్లో ఖరీదు చేసే కెమెరాను బహుమతిగా ఇవ్వడంతో చిరంజీవి ఆశ్చర్యపోయారని సమాచారం.
కృష్ణంరాజు స్వతహాగా భోజన ప్రియుడు కాగా ఆయన ఆతిథ్యం గురించి ఇండస్ట్రీలో చాలా గొప్పగా చెప్పుకుంటారు. కృష్ణంరాజు అలవాట్లే ప్రభాస్ కు వచ్చాయని అభిమానులలో చాలామంది భావిస్తారు. గొప్ప మనస్సు ఉన్న కృష్ణంరాజు భౌతికంగా మరణించినా అభిమానుల హృదయాలలో మాత్రం నిలిచిపోతారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!