Krishnam Raju: ఆ విషయంలో చాలా రిచ్ అని కృష్ణంరాజు చెప్పారా?

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్త సినీ అభిమానులను ఎంతగానో బాధపెట్టిన సంగతి తెలిసిందే. ఎవరికీ అపకారం చేయని కృష్ణంరాజు తన మంచితనంతో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. రియల్ లైఫ్ లో మృదు స్వభావి అయిన కృష్ణంరాజు సినిమాలలో మాత్రం ఎక్కువగా సీరియస్ రోల్స్ లో నటించడం గమనార్హం. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో కృష్ణంరాజు మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను డబ్బు విషయంలో కాదని మనసు విషయంలో చాలా రిచ్ అని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

నేను ఎప్పుడైనా అంతేనని ఆయన చెప్పుకొచ్చారు. బ్యాంకులో లక్షలు, రూ.కోట్లు ఉండటం బీరువా తీసిన వెంటనే డబ్బులు రావడం ఎప్పుడూ లేదని కృష్ణంరాజు పేర్కొన్నారు. వచ్చిన డబ్బు వెంటనే ఖర్చైపోయేదని కృష్ణంరాజు కామెంట్లు చేశారు. రాబడి సంగతి ఆలోచించకుండా ఖర్చు చేసేవాళ్లమని ఆయన అన్నారు. ఇంటినుంచి స్టూడియోకు వచ్చేవరకు నేను కృష్ణంరాజునని మేకప్ వేసుకుంటే కృష్ణంరాజును కాదని ఆయన తెలిపారు. నాకు మేకప్ లో ఉన్న సమయంలో ప్రపంచం జ్ఞాపకం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు.

డ్రింక్ చేయడం అలవాటే అని మాట తడబడటం కానీ కాలు తూలటం కానీ ఎప్పుడూ జరగలేదని కృష్ణంరాజు కామెంట్లు చేశారు. పేకాటపై ఇంట్రెస్ట్ ఉండేది కాదని కానీ నేను సరదాగా మాత్రమే ఆడేవాడినని ఆయన తెలిపారు. సినిమాలతో పాటు హైదరాబాద్ లో వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. లాభనష్టాలు పట్టించుకోకుండా వ్యాపారాన్ని కొనసాగించానని కృష్ణంరాజు అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో నేనేం ఎక్కువగా కష్టపడలేదని ఆయన తెలిపారు. కృష్ణంరాజు గతంలో వెల్లడించిన ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో విలన్ రోల్స్ లో నటించి తన నటనతో కృష్ణంరాజు మెప్పించారు. కృష్ణంరాజు సినిమాలకు ఈతరం ప్రేక్షకులలో కూడా అభిమానులు ఉన్నారు. ఎంతోమందికి సహాయం చేసినా ఆ సహాయాల గురించి చెప్పుకోవడానికి కృష్ణంరాజు ఇష్టపడలేదు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus