Krishnam Raju: భోజనం విషయంలో కృష్ణంరాజు థియరీ ఇదీ!

  • September 12, 2022 / 06:07 PM IST

కృష్ణంరాజును అందరూ రెబల్‌ స్టార్‌ అని అంటుంటారు. అంతలా తన సినిమాల్లోని నటనతో మెప్పించారాయన. అయితే నిజ జీవితంలో ఆయన మర్యాద రామన్న. అదేదో సినిమాలో చూపించినట్లు.. తిండి విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటుంటారుట. ఎవరైనా స్నేహితులు, బంధువులు, ముఖ పరిచయం ఉన్నవాల్లు వస్తే వాళ్లకు షడ్రుచుల భోజనం తప్పనిసరి అంటుంటారు. ఇవే బుద్ధులు ప్రభాస్‌కి కూడా వచ్చాయి అనుకోండి. అయితే తిండి గురించి కృష్ణంరాజు దగ్గర ఓ థియరీ ఉందట.

ముందుగా చెప్పినట్లు కృష్ణంరాజు అంటే ఆతిథ్యం.. ఆతిథ్యం అంటే కృష్ణంరాజు. అంతేకాదు భోజ‌నం విష‌యంలో కృష్ణంరాజు రాజీప‌డ‌ట‌ం, తిండి విష‌యంలో నియ‌మాలు పెట్టుకోవ‌డ‌ం లాంటివి అస్సలు నచ్చదట. ఇదే విష‌యాన్ని గతంలో కొన్ని సార్లు చెప్పారు కూడా. ఎలాంటి భోజ‌నం అంటే త‌న‌కు బాగా ఇష్ట‌ం, ఎలా తినడం అంటే ఇష్టం లాంటి విషయాలను కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో చక్కగా చెప్పుకొచ్చారు. ఆయన మాటలు వింటేనే నోరూరిపోతుంది అనుకోండి.

ఫుడ్‌ అనగానే కృష్ణంరాజు ఛాయిస్ నాన్ వెజ్ వైపే ఉంటుందట. ఇంట్లోనే కోడిని కోయించుకుని తినడాన్ని బాగా ఇష్టపడతారట. ఇందాక థియరీ అని చెప్పాం కదా.. అదేంటంటే.. ‘‘ఎవరైనా జీవితంలో తినాలంటే రెండు జ‌న్మ‌ల‌కు స‌రిప‌డినంత తినాలి. నేను అలానే తింటాను’’ అని చెప్పారట కృష్ణంరాజు. అంతేకాదు ర‌క‌ర‌కాల రుచులను ఆస్వాధించ‌డాన్ని జీవ‌న‌శైలిలో భాగం చేసుకున్నారు కృష్ణంరాజు. తిన‌డానికి ఎవ‌రైనా భ‌య‌ప‌డుతుంటే ఆ భ‌యం పెట్టుకోన‌క్క‌ర్లేద‌ని కృష్ణం రాజు మాటలు వింటే అర్థమవుతాయి.

తిండి విషయంలో రూల్స్‌, రెగ్యులేషన్స్‌ పెట్టుకొని ఉండటం చాలామందికి నచ్చదు. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది నోరు కట్టేసుకుంటూ ఉంటారు. కానీ కృష్ణంరాజు అలా కాదు. మనసారా తింటూ కడుపు, మనసు రెండూ నింపుకునేవారు. అందుకే 80 ఏళ్లకుపైగా బతికారు అని చెప్పొచ్చు. కాబట్టి కడుపు, నోరు కట్టేసుకొని ఉండటం కంటే.. మంచిగా తిని, చక్కగా బతకాలి అని చెప్పొచ్చు. కృష్ణంరాజు థియరీ అద్భుతంగా ఉంది కదా.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus