Krishnam Raju: సోదరుడి కొడుకులపై కృష్ణంరాజు ప్రేమ!

సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను మొయినాబాద్ సమీపంలోని కనక మామిడిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో నిర్వహించారు. కృష్ణంరాజుకి కొడుకులు లేకపోవడంతో అంత్యక్రియలు ఎవరు నిర్వహిస్తారనే చర్చలు జరిగాయి. అయితే ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. కృష్ణంరాజు చనిపోవడానికి ముందే తన కర్మక్రియలను ఎవరు నిర్వహించాలనే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. కృష్ణంరాజు మొదటి భార్య యాక్సిడెంట్ లో చనిపోయారు.

వీరికి ఒక కూతురు ఉంది. అప్పట్లో ఆమెకి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. ఆ తరువాత శ్యామలాదేవిని రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణంరాజు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. కొడుకు కోసం వేచి చూసిన కృష్ణంరాజు దంపతుల కోరిక తీరలేదు. అయితే కొడుకులు లేరనే లోటు తన సోదరుడి కొడుకులు ప్రభాస్, ప్రభోద్ లతో తీరిందని చెప్పారు కృష్ణంరాజు. తాను హిందూ ధర్మాన్ని పాటిస్తానని.. చనిపోయిన తరువాత జరిగే కర్మక్రియల గురించి తెలుసుకున్నానని అన్నారు.

తనకు కొడుకులు లేరనే ఫీలింగ్ లేదని.. తన సోదరుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి.. వాళ్లు కూడా తన కొడుకులు లాంటి వాళ్లేనని.. వారే తనకు కర్మక్రియలను జరిపిస్తారని అన్నారు కృష్ణంరాజు. ఆయన కోరుకున్నట్లుగానే ప్రభాస్ అన్నయ్య ప్రభోద్.. కృష్ణంరాజుకి అంత్యక్రియలను నిర్వహించారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus