సినిమా చూసి ఏడ్చేసేవాళ్లు ఉంటారా? ఈ మాటకు చాలావరకు లేదు అనే సమాధానం వస్తుంది. సెంటిమెంట్, ఎమోషన్స్‌తో ఉండే సినిమాలకు అయితే కచ్చితంగా యస్ అనే ఆన్సర్ వస్తుంది. కానీ ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కుటుంబ నేపథ్య కథ చూస్తే కన్నీళ్లు వస్తాయా అంటే లేదనే చెప్పాలి. కానీ ఇలాంటి సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుందట కృతి శెట్టి. ‘కస్టడీ’ సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన కృతి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది.
నాగచైతన్య, కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నటించిన తొలి చిత్రం ‘బంగార్రాజు’. ఆ సినిమా చూశాకనే కృతి శెట్టి ఎమోషనల్ అయ్యిందట. ఆ సినిమాలో అంతగా ఏముంది అనుకుంటున్నారా? ఆ సినిమాలోని మెయిన్ కాన్సెప్టే దీనికి కారణమట. ‘‘బంగార్రాజు’ సినిమాకు కృతి శెట్టి బాగా కనెక్ట్ అయ్యిందట. ఆ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా దర్శకుడు కల్యాణ్ కృష్ణకు ఫోన్ చేసిందట. అలా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే ఏడ్చేసిందట.
అంతలా ఎందుకు అంటే.. సినిమాకు అంతగా కనెక్ట్ అయ్యాను అని చెబుతోంది. ‘బంగార్రాజు’ సినిమా కాన్సెప్ట్ వాళ్ల ట్రెడిషన్ అట. శెట్టి కుటుంబాల్లో ఓ నమ్మకం ఉంటుందట. ఆత్మ రూపంలో పెద్దోళ్లు వాళ్ల చుట్టూ ఉంటారు.. కాపాడుతుంటారు అని నమ్ముతారట. వాళ్లకు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారట. దీంతో ‘బంగార్రాజు’ సినిమా చూసినప్పుడు కృతి శెట్టికి పూర్వీకులు, వాళ్ల సంప్రదాయాలు గుర్తొచ్చాయట. వాళ్ల మనసులో ఉన్న నమ్మకం తెరపై కనిపించేసరికి ఎమోషనల్ అయ్యిందట కృతి శెట్టి.
తన సినిమాలు చూసి ఏడ్చిన సందర్భం ఇదొక్కటే కాదంట. మరో సినిమా విషయంలోనూ ఇలానే జరిగిందట. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చూసినప్పుడు కూడా ఇలానే ఏడ్చేసిందంట కృతి. ఆ సినిమాలోనూ ఇలానే పునర్జన్మల కాన్సెప్ట్‌లో నడుస్తుంది. అందుకే ఆ సినిమా విషయంలోనూ అలా చేసింది అనుకోవచ్చు. ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే… వరుస సినిమాలతో బిజీగా ఉండే కృతి వరుస ఫ్లాప్‌లతో స్లో అయిపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో ఓ మలయాళం సినిమా మాత్రమే చేస్తోంది.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!