తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం కొంతమంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. తొలి సినిమాతోనే ఆ స్టేటస్ ను అందుకున్న హీరోయిన్లలో కృతిశెట్టి కూడా ఒకరు. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల విజయాలతో కృతిశెట్టికి ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఇమేజ్ వచ్చింది. ప్రస్తుతం కృతిశెట్టి మిడిల్ రేంజ్ హీరోలు, యంగ్ హీరోలకు ఫేవరెట్ హీరోయిన్ గా ఉన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిశెట్టి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈరోజు నాన్న కోసం తాను ముంబైకు వచ్చానని నాన్నకు స్వీట్స్, షూస్ ఇష్టం కావడంతో కొత్త షూస్ కొనుగోలు చేయడంతో పాటు కేక్ ఆర్డర్ పెట్టానని ఫాదర్స్ డేను ఈ విధంగా తాను సెలబ్రేట్ చేసుకుంటానని కృతిశెట్టి వెల్లడించారు. నేను ఉంటే నాన్న సంతోషిస్తారని నాన్నను సంతోషపెట్టే విషయం నేనేనని ఆమె తెలిపారు. అమ్మానాన్న జాబ్ చేసేవారని డాడీ బాల్యంలో నన్ను వదిలి ఉండేవారు కాదని స్కూల్ నుంచి పికప్ చేసుకుని రెస్టారెంట్ ను తీసుకెళ్లేవారని ఆమె చెప్పుకొచ్చారు.
నాన్నకు సినిమాలు అంటే ఇష్టమని నాన్న నన్ను బుంగీ అని పిలుస్తారని కృతిశెట్టి చెప్పుకొచ్చారు. నాన్న నాకంటే కూల్ అని స్కూల్ లో నాకు ఎప్పుడూ మంచి మార్కులు వచ్చేవని కృతిశెట్టి వెల్లడించారు. బాధను పాజిటివ్ గా తీసుకుని అధిగమించాలని నాన్న చెప్పేవారని కృతి అన్నారు. నాన్నకు నాకు ఫుడ్ అంటే ఇష్టమని పాత హిందీ పాటలు అంటే ఇష్టమని కామెడీ చాలా ఇష్టమని కృతిశెట్టి అన్నారు.
సినిమా రంగంపై తన తల్లీదండ్రులకు సదభిప్రాయం ఉందని మంచి చేస్తే మంచి జరుగుతుందని నాన్న చెబుతూ ఉంటారని కృతి అన్నారు. నాన్న పాజిటివ్ పర్సన్ అని ఇతరులకు హెల్ప్ చేయాలని నాకు కూడా చెబుతూ ఉంటారని కృతిశెట్టి అన్నారు. తండ్రి గురించి కృతిశెట్టి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.