Krithi Shetty: కృతి శెట్టి స్టైలిష్ వర్క్ శారీ కాస్ట్ ఎంతో తెలుసా!

‘ఉప్పెన’ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. దాంతో వరుసగా క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.. అమ్మడికి అవకాశాలొచ్చినంత ఈజీగా హిట్స్ అయితే రాలేదు పాపం.. గతేడాది ‘బంగార్రాజు’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘వారియర్’.. ఇలా ఏకంగా నాలుగు క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒక్క ‘బంగార్రాజు’ మినహా ఇస్తే వరుసగా మిగతా మూడు ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టేసింది. ప్రస్తుతం నాగ చైతన్యతో ‘కస్టడీ’ చేస్తుంది.

ఈమధ్యనే చిత్రీకరణ ముగిసింది. కృతి పాప తిరిగి ట్రాక్ ఎక్కాలంటే ఉన్నపళంగా ఓ హిట్ పడాల్సిందే.. ఇటీవల సూర్య – బాలా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ కొంత షూటింగ్ జరిగాక ఆ ప్రాజెక్ట్ ఆపేశారు.. నాగ చైతన్య పక్కన వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న ‘కస్టడీ’ తెలుగుతో పాటు తమిళ్‌లోనూ తెరకెక్కుతోంది.. ఇదిలా ఉంటే.. కృతి శెట్టి ప్రెస్ మీట్స్‌లో కానీ ప్రైవేట్ ఈవెంట్స్‌లో కానీ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంటుంది.. యూత్‌లో ఎలాగూ మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. లేడీ ఫ్యాన్స్ బేబమ్మ కాస్ట్యూమ్స్ గురించి..వాటి కాస్ట్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు..

ఆ బ్రాండ్స్, వాటి వాల్యూకి సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతుండడం చూశాం.. తను ధరించిన స్పైస్ మార్కెట్ షరారా సెట్ (దుప్పట్టాతో కలిపి), గ్రీన్ స్లీవ్‌లెస్ జాకెట్ (చైన్ టస్సెల్స్ & ప్యాంట్స్‌తో కలిపి), నిధి షరారా సెట్ (ముఘల్ ప్రింట్‌తో దుప్పట్టాతో కలిపి), జార్జెట్ ఎంబ్రాయిడరీ కుర్తా షరారా సెట్ యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల ఓ స్టైలిష్ శారీలో మెరిసిపోయింది కృతి శెట్టి.. దీంతో దాని గురించి ఆరా తీశారు.. ఆ చీర డీటెయిల్స్ ఇలా ఉన్నాయి..

Sawan Gandhi – IVORY MUKEISH WORK SAREE (సావన్ గాంధీ – ఐవరీ ముకీష్ వర్క్ శారీ) – కాస్ట్ : రూ. 99,000/-

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus