Krithi Shetty: ఆమెతో కామెడీ చేయిస్తారా? వర్కవుట్‌ అవుతుందా విశ్వక్‌సేన్‌!

Ad not loaded.

తెలుగులో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించి, కొద్ది రోజుల్లోనే స్టార్‌ హీరోయిన్‌ స్థాయిని అందుకునేవైపు వెళ్లింది కృతి శెట్టి (Krithi Shetty). చిన్న వయసులోనే హీరోయిన్‌ అయినా, క్యూట్‌ లుక్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును క్లీన్‌బౌల్డ్‌ చేసింది. అయితే ఆ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో విజయాల కంటే ఫ్లాప్‌లే ఎక్కువ అయిపోయాయి. దీంతో ఇతర భాషలవైపు వెళ్లింది. తెలుగులో సినిమాలు తగ్గిపోతూ వచ్చాయి. వచ్చిన రెండేళ్లలో వరుస సినిమాలు చేసిన కృతి శెట్టి ఆ తర్వాత 2023, 2024లో ఒక్కో సినిమా మాత్రమే చేసింది.

Krithi Shetty

ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఆమె ఓకే చెప్పలేదు. దీంతో ఏమైంది కృతి తెలుగు సినిమాలు తగ్గిపోయాయి అనుకోవడం ప్రారంభించారు. అయితే ఆమేమీ ఖాళీగా లేదు. తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు తెలుగు సినిమా ఛాన్స్‌ కూడా వచ్చింది అని సమాచారం. గతేడాది ‘మనమే’ (Manamey) చిత్రంలో నటించిన కృతికి విజయం దక్కలేదుజ కృతి త్వరలోనే తెలుగు సినిమాకి సంతకం చేయనున్నట్టు సమాచారం.

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) హీరోగా అనుదీప్‌ (Anudeep Kv) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని మొదలుపెట్టింది. ఆ సినిమాలోనే కృతిని కథానాయికగా ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అన్నీ కుదిరి అనుకున్నది అనుకున్నట్లగా జరిగితే ఈ ఏడాదికి కృతికి ఓ సినిమా వచ్చినట్లే. కృతి ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంగతి చూస్తే..

తమిళంలో ఒక సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. కార్తి (Karthi) సరసన ఆమె నటిస్తున్న ‘వా వాతియార్‌’ త్వరలో విడుదల అవుతుంది. ఇది కాకుండా ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’, ‘జీనీ’ సినిమాలు ఉన్నాయి. ఆ రెండూ చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. మలయాళంలో గతేడాదే ‘ఏఆర్‌ఎం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హిందీలో మళ్లీ నటిస్తుంది అని వార్తలొచ్చినా అవి ఇంకా తేలలేదు. ‘సూపర్‌ 30’ సినిమాతో తొలిసారి సినిమాల్లో కనిపించింది కృతి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus