అందమైన చిరునవ్వుతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కృతి శెట్టి (Krithi Shetty) కెరీర్ మాత్రం కొంతకాలంగా నిలకడ లేకుండా సాగుతోంది. ఉప్పెన (Uppena) సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిన ఈ బేబమ్మ, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత మెప్పించకపోవడంతో, అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ‘మాచర్ల నియోజకవర్గం’(Macherla Niyojakavargam), ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali), ‘మనమే’(Manamey) లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించకపోవడంతో ఆమె కెరీర్ పుంజుకోలేదు. ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తున్నా, అక్కడ కూడా పెద్ద బ్రేక్ రాలేదు.
Krithi Shetty
అలానే మలయాళంలో చేసిన ప్రయత్నం ఒక మోస్తరుగా నిలిచినా, తదుపరి అవకాశాలు రావడం లేదన్నది నిజం. ఈ నేపథ్యంలో తెలుగులో మరోసారి ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన కృతి, తన కెరీర్ కోసం గ్లామర్ మార్గం ఎంచుకోవాలని భావించినట్టు టాక్. ఇప్పటివరకు క్లాస్ పర్సనాలిటీతో కన్పించిన ఈ బేబమ్మ, ఇకపై బోల్డ్ కాన్సెప్ట్‌లకు కూడా ఓపెన్‌గా ఉన్నట్టు ఫిలింనగర్ టాక్.
గతంలో గ్లామర్ పాత్రల నుంచి దూరంగా ఉండే కృతి, ఇప్పుడు తన నిర్ణయం మార్చుకుంటుందన్న ఊహాగానాలు షురూ అయ్యాయి. అందుకు కారణం.. ప్రస్తుతం ప్రేక్షకులు యూత్ అప్పీల్ ఉన్న కథలను, గ్లామర్ పాత్రలను ఎక్కువగా ఆదరిస్తున్న తరహా ట్రెండ్. దీంతో, ఇంపాక్ట్ కావాలంటే గ్లామర్ నే ఫాలో అవ్వాలి అనే ఫీలింగ్‌తో కృతి కొత్త అవతారానికి సిద్ధమవుతోందట.
తన నటనలో ఓ స్థాయి చూపించినా, ప్రస్తుతం అవకాశాల కొరత ఉండటంతో, కొత్త రూట్ ట్రై చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ పరిణామాలు చూస్తుంటే, బేబమ్మ గ్లామర్ డోస్ పెంచి, తన కెరీర్‌ను మళ్లీ రీబూట్ చేయాలనే ఆతృతతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలితమిస్తుంది అనేది ప్రేక్షకుల స్పందన మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్కసారైనా గ్లామర్ గేర్ వేస్తే, ఈ బేబమ్మకి మళ్ళీ బ్రేక్ రావచ్చని అనిపిస్తోంది.