Kubera: కుబేరా బిజినెస్ బజ్.. రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్‌లో!

టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) , కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కుబేరా (Kubera) ఇప్పుడు థియేటర్‌కి ముందే మంచి జోష్ తెచ్చుకుంటోంది. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదటి నుంచీ క్రేజ్ ఉండటంతో షూటింగ్ కంప్లీట్ అవగాను బిజినెస్ ట్రాక్‌ పై స్పీడ్ పిక్కప్ అయ్యింది. ఇప్పటికే జూన్ 20 రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్, ప్రోమోషనల్ ప్లానింగ్‌ లో కూడా అడుగులు వేగంగా వేస్తున్నారు.

Kubera

ఇక మూవీకి సంబంధించి బడ్జెట్ రూ.100 కోట్ల దాకా వెళ్లిందట. అయితే అదే సమయంలో ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా వేగంగా పూర్తవుతుండటం విశేషం. ఓటీటీ, హిందీ డబ్బింగ్, డిజిటల్ ఆడియో హక్కుల ద్వారా ఇప్పటికే పెట్టుబడి లో 30 శాతం తిరిగి వచ్చిందని టాక్. థియేట్రికల్ రైట్స్ కోసం తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయట. దీంతో మిగిలిన మొత్తం కూడా త్వరలో రాబోయే అవకాశముంది. ఈ లెక్కల ప్రకారం కుబేరా రిలీజ్‌కి ముందే మేకర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్టే.

ఇక పాటల పరంగా చూస్తే, రీసెంట్ గా విడుదలైన ‘పోయిరా మామ’ లిరికల్ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మొదట స్లోగా ఉన్న పాట ఇప్పుడు స్టెడీగా ఎక్కేస్తుండటంతో, మ్యూజిక్ ప్రమోషన్స్ పై మేకర్స్ మరింత ఫోకస్ పెడుతున్నారు. త్వరలోనే మిగతా పాటలు కూడా రిలీజ్ చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కంపోజ్ చేసిన ఈ ఆల్బమ్ ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకుంది. ఈ సినిమాతో రష్మిక మందన్న (Rashmika Mandanna)  ఓ కొత్త లుక్ లో కనిపించనుండటం మరో విశేషం.

ఇప్పటికే విడుదలైన ఆమె పోస్టర్లకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. జిమ్ సెర్బ్, దలీప్ తహిల్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ, పక్కా కంటెంట్ డ్రివెన్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే సంకేతాలు ఉన్నాయి. అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న కుబేరా.. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus