Kumari Aunty, Keerthi Bhat: కీర్తి భట్ కామెంట్లపై కుమారి ఆంటీ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల పాపులారిటీని పెంచుకున్న కుమారి ఆంటీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. బుల్లితెర ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఆమె ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ టేస్ట్ చేస్తూ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే ప్రముఖ బుల్లితెర నటి కీర్తి భట్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ టేస్ట్ చేసి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. ఫుడ్ అస్సలు బాలేదని నేను వండినా ఇంతకంటే బెటర్ గా చేస్తానని ఆమె అన్నారు.

ఈ కామెంట్ల గురించి ఒక సందర్భంలో కుమారి ఆంటీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీర్తి భట్ నా ఫుడ్ స్టాల్ లో ఫుడ్ టేస్ట్ చేసిన రోజున నేను హైదరాబాద్ లో లేనని ఆ వంట కూడా నేను వండిన వంట కాదని ఆమె తెలిపారు. మగవాళ్లు చేసిన వంటకు ఆడవాళ్లు చేసిన వంటకు టేస్ట్ విషయంలో తేడా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. కీర్తి భట్ ఒపీనియన్ ను నేను గౌరవిస్తానని కుమారి ఆంటీ తెలిపారు.

ప్రతి ఒక్కరికీ నా ఆహారం నచ్చాలని రూల్స్ లేవు కదా అని ఆమె కామెంట్లు చేశారు. నా హోటల్ లో ఫుడ్ బాలేదని చెబితే నేను తప్పుగా అనుకోనని కుమారి ఆంటీ వెల్లడించారు. నేను వండే వంట కొంతమందికి నచ్చొచ్చని మరి కొందరికి నచ్చకపోవచ్చని ఆమె తెలిపారు. కుమారి ఆంటీ స్పందించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె (Keerthi Bhat) స్పందించిన తీరు ఆకట్టుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఫుడ్ బిజినెస్ ద్వారా కుమారి ఆంటీ నెలకు 2 లక్షల రూపాయలకు అటూఇటుగా సంపాదిస్తున్నారు. యూట్యూబ్ రీల్స్ వల్ల పాపులర్ అయిన కుమారి ఆంటీకి టీవీ షోలతో పాటు సీరియల్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. కుమారి ఆంటీ సీరియల్స్, షోల ద్వారా ఆర్థికంగా సులువుగా సెటిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus