విజయ్ దేవరకొండ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా ‘గీత గోవిందం’. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్లో రూ.70 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ఆ సినిమా అంత కలెక్ట్ చేయడానికి చాలా ఫాక్టర్స్ ఉన్నాయి. కానీ ఆ తర్వాత విజయ్ చేసిన సినిమాలు ‘గీత గోవిందం’ కలెక్షన్లలో సగం కూడా రాబట్టలేకపోయాయి. అయినా సరే ‘లైగర్’ సినిమాకి హైప్ క్రియేట్ అయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్’ తో డబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న పూరి అందుకు ఓ కారణం.
విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ ఆ సినిమాపై హైప్ పెరుగుతూనే వచ్చింది. దీంతో ఆ మూవీకి ఏకంగా రూ.85 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఫుల్ రన్లో ఆ మూవీ రూ.30 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది. ‘లైగర్’ నష్టాలు భర్తీ చేయమంటూ బయ్యర్స్ కూడా పూరి పై ఒత్తిడి తేవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తర్వాతి సినిమాకి ‘లైగర్’ రేంజ్లో బిజినెస్ జరుగుతుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేము.
కానీ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఖుషి’ సినిమాకి ‘లైగర్’ రేంజ్లోనే బిజినెస్ జరుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఖుషి’ మూవీకి రూ.90 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందట. ఆల్రెడీ కొన్ని డీల్ ఫైనల్ అయిపోయినట్టు వినికిడి. మూడు ప్లాప్ లు వచ్చాక కూడా విజయ్ దేవరకొండ సినిమాకి ఇంత బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు. అయితే ‘ఖుషి’ కి ఎక్కువ బిజినెస్ జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మినిమం గ్యారెంటీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి సంస్థ నిర్మిస్తున్న మూవీ. దర్శకుడు శివ నిర్వాణ సినిమాలు కూడా మినిమం గ్యారెంటీ అనే విధంగా ఉంటాయి. ‘టక్ జగదీష్’ కు నెగిటివ్ టాక్ వచ్చినా.. అది ఓటీటీలో రిలీజ్ అయ్యి సేఫ్ అయ్యింది. అందుకే విజయ్ దేవరకొండ ‘ఖుషి’ విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టే సినిమా అవ్వబోతుంది.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!