చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్న చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరంటే?

తెలుగు బుల్లితెర పై ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమం కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం వచ్చే నెల మొదటి వారంలో ప్రసారం కాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పటికే సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొందరి పేర్లు వైరల్ అవుతున్నాయి.అయితే ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇకపోతే తాజాగా మరొక కంటెస్టెంట్ పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కంటెస్టెంట్ లేడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈమె పలు సినిమాలలో అలాగే బుల్లితెర సీరియల్స్ లో నటించి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఈ క్రమంలోనే తిరిగి ఈమెను ఈ కార్యక్రమానికి తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకురానున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ లేడీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు అనే విషయానికి వస్తే…

 

వెంకటేష్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రలో నటించిన సుదీప. ఈమె పేరు సుదీప్ అయినప్పటికీ ఈ సినిమాలో పింకీ పాత్రలో నటించి అందరికీ పింకీ గానే సుపరిచితమయ్యారు.ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరిని మెప్పించిన ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే బిగ్ బాస్ ద్వారా మరోసారి ఈమెను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్వాహకులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Share.