Bigg Boss 5 Telugu House: ఈవారం ఎలిమినేట్ అయ్యింది ఆమె..!

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం రసవత్తరమైన ఎలిమినేషన్ కొనసాగుతోంది. 3వ వారంలో ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో ప్రియా, ప్రియాంక సింగ్, లహరి, శ్రీరామ్, మానస్ లు ఉన్నారు. శనివారం హోస్ట్ నాగార్జున వచ్చిన నామినేషన్స్ లో ఉన్న ఇద్దరిని సేఫ్ చేశారు. ప్రియాంక సింగ్ ఇంకా శ్రీరామ్ చంద్రలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఇక ఆదివారం మిగిలిన ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

మానస్, ప్రియ, ఇంకా లహరిలు ఉన్నారు. నిజానికి చాలామంది బిగ్ బాస్ కాల్ తీస్కుని ఈవారం ప్రియని ఎలిమినేట్ చేస్తారనే అనుకున్నారు. కానీ, ఓటింగ్ లో లీస్ట్ వచ్చిన లహరిని ఎలిమినేట్ చేశారు. అంతేకాదు, అసలు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అని కూడా వార్తలు వినిపించాయి. కేవలం మూడురోజులు మాత్రమే ఓటింగ్ పెట్టిన నేపథ్యంలో ఎలిమినేషన్ అనేది ఈవారం ఉండదనే అనుకున్నారు.కానీ, బిగ్ బాస్ హౌస్ నుంచీ మూడోవారం లహరి అవుట్ అయినట్లుగా తెలుస్తోంది.

గేమ్ పరంగా బాగా ఆడినా, గ్లామర్ పరంగా బాగా ఆకట్టుకున్నా కూడా ఓటింగ్ లో రాణించలేకపోయింది ఈ అమ్మడు. అందుకే, మూడోవారమే హౌస్ నుంచీ బయటకి వచ్చేసిందని తెలుస్తోంది. మరి బయటకి వచ్చిన తర్వాత ఎలాంటి కామెంట్స్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus