Pooja Hegde: పూజకి కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన లత!

కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉనప్పుడే వివాహం చేసుకోవడం మన దగ్గర హీరోయిన్లకు తక్కువ కానీ.. బాలీవుడ్‌ హీరోయిన్లకు చాలా ఎక్కువ అని చెప్పాలి. చాలామంది నాయికలు ఇలానే చేస్తుంటారు కూడా. అలా మన దగ్గర ఉంటూ, బాలీవుడ్‌లో ఉంటూ పాన్‌ ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే మససు కూడా పెళ్లి వైపునకు మళ్లిందా? ఏమో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాతృమూర్తి లతా హెగ్డే మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది.

మాతృదినోత్సవం సందర్భంగా ఇటీవల లతా హెగ్డే, పూజా హెగ్డే కలసి ఓ మీడియాతో మాట్లాడారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పడంతో పాటు, పూజకి కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాలను కూడా వెల్లడించారు. దాంతోపాటు పూజా అభిరుచుల గురించి కూడా చెప్పారు. ‘పూజ ఎలాంటి వ్యక్తిని ఇష్టపడుతుంది’ అనే ప్రశ్నకి బదులిస్తూ ఈ మేరకు కొన్ని అంశాలను ఆమె ప్రస్తావించారు. దీంతో ‘పూజకు కాబోయే వాడు ఇలా ఉండాలి’ అంటూ అభిమానులు ఆ విషయాలను వైరల్‌ చేస్తున్నారు.

అన్నిరకాలుగా అర్థం చేసుకునే వ్యక్తి గురించి పూజ ఎదురుచూస్తోంది. వివాహ బంధం కలకాలం నిలిచి ఉండాలంటే భార్యాభర్తలిద్దరి మధ్య చక్కటి భాగస్వామ్యం ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. బంధంలో గౌరవం ఇవ్వని వ్యక్తితో కలిసి ఉండటం చాలా కష్టం.. ఆ బంధం ఎక్కువ రోజులు నిలవదు అని వివరించారు లతా హెగ్డే. పూజ గురించి చెబుతూ.. పూజ సున్నిత మనస్కురాలు. అందుకే ఆమె జీవితంలో ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త తీసుకునే వ్యక్తి కావాలి అని చెప్పారు.

పూజకు (Pooja Hegde) కాబోయే భర్త స్ఫూర్తిగా నిలవాలి, ఆమె కెరీర్‌ని ప్రోత్సహించాలి. అలాంటి అబ్బాయినే పూజ కోరుకుంటోంది అని లత చెప్పుకొచ్చారు. ఈ మాటలకు పక్కనే ఉన్న పూజ కూడా స్పందించింది. నా జీవితంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మా అమ్మే. నువ్వు కన్న కలలన్నీ నెరవేర్చాననే అనుకుంటున్నాను. నువ్వు నాకు ప్రతి పనికి నా కృతజ్ఞతలు అంటూ తల్లి గురించి చెప్పింది పూజ.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus