Liger Movie: ‘లైగర్‌’ ఫలితం ఆ హిట్‌ గాలి తీసేస్తోంది!

  • August 29, 2022 / 05:24 PM IST

వరుస పరాజయాల నుండి పూరి జగన్నాథ్‌ను బయట పడేసిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. రామ్‌ను ఉస్తాద్‌ రామ్‌గా మార్చిన సినిమా ఇది. ఆ సినిమా విజయంతో మొత్తం అప్పులు తీరిపోయి, మళ్లీ పూరి జగన్నాథ్‌ నిర్మాతగా ఫుల్‌ స్వింగ్‌లోకి కూడా వచ్చారు అంటారు. దర్శకుడిగా పూరి మళ్లీ మునపటి షార్ప్‌ అయ్యారు అని కూడా అన్నారు. అయితే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ పూరి స్థాయి సినిమా కాదని, ఒకప్పటి పూరి ప్రోడెక్ట్‌లా లేదు అని కూడా చెబుతుంటారు.

కానీ, పూరి ఈజ్‌ బ్యాక్‌ అంటూ అభిమానులు ఆ సినిమా చూసి ముచ్చటపడిపోయారు. కానీ సగటు ప్రేక్షకుడు, సినిమా విశ్లేషకులు మాత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా సాధారణ సినిమాగా అభివర్ణించారు. మరికొందరైతే ఫ్లూక్‌లో వచ్చిన అంటే అనుకోండా వచ్చిన విజయం అని కామెంట్స్‌ చేశారు. అప్పుడు దీనిపై చాలా చర్చ కూడా నడించింది. ‘అనుకోకుండా వచ్చిన విజయం’ అనే మాటను అప్పుడు సపోర్టు చేయని వారు కూడా ‘లైగర్‌’ ఫలితం చూసి.. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకు ముందుగా పూరి జగన్నాథ్‌ ట్రాక్‌ రికార్డు చూస్తే.. వక్కంతం వంశీ కథతో చేసిన ‘టెంపర్’ మినహాయిస్తే సరైన విజయమే లేదు. ‘జ్యోతిలక్ష్మి’, ‘ఇజం’, ‘రోగ్’, ‘పైసా వసూల్’, ‘మెహబూబా’ లాంటి డిజాస్టర్లు ఆయన ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. తన కెరీర్‌ అలా డౌన్‌ అయిపోతున్నా.. పూరి జాగ్రత్త పడలేదు అని అంటుంటారు. కానీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయంతో పూరి సెట్‌ అయ్యారు అనిపించింది. కానీ ఇప్పుడు ‘లైగర్‌’ ఫలితం ‘ఇస్మార్ట్‌’ బరువు తగ్గించేస్తోంది.

పూరి జగన్నాథ్‌ సినిమా అన్నా, ఆయన మలిచిన హీరో అన్నా ఓ రకమైన ఇంట్రెస్ట్‌ ఉంది టాలీవుడ్‌లో. అప్పటివరకు ఆ హీరో ఒకలా ఉంటే, పూరి జగన్నాథ్‌ సినిమా తర్వాత మరోలా కనిపిస్తాడు అంటారు. ఇక డైలాగ్స్‌ విషయంలో పూరి మార్క్‌ మామూలుగ ఉండదు. ట్విస్ట్‌లు, టర్న్‌లు పూరికి ప్లస్‌. అయితే ఇవన్నీ ‘లైగర్‌’లో లేవు. దీంతో ‘లైగర్‌’ ఫలితం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మీద పడి.. మొత్తంగా పూరి ఇమేజ్‌ డ్యామేజీ చేస్తోంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus