పూరి జగన్నాథ్‌కి కథ రాయడానికి ఎంత టైమ్ పడుతుంది… ఏముంది బ్యాంకాక్ ఫ్లైట్‌కి టికెట్లు ఉండి, బయలుదేరి వెళ్తే ఓ నెల రోజుల్లో రెడీ అయిపోవచ్చు. మహా అయితే 45 రోజులు అవుతుంది. మరి సినిమా పూర్తవడానికి ఏముంది ఓ మూడు నెలలు వేసుకోండి అంటారా? నిజమే మరి పూరి కదా… ఆయన సినిమాలు, హీరోల క్యారక్టరైజేషన్లలా షూటింగ్ చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన సినిమాల వివరాలు ఓ సారి చూస్తే మనకు ఆ విషయం బాగా అర్థమైపోతుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే… ‘లైగర్’ రిలీజ్ ఎప్పుడనే విషయం చెప్పడానికి.
విజయ్ దేవరకొండ – అనన్య పాండే – పూరి జగన్నాథ్ కాంబోలో ‘లైగర్’ పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతోంది. ఇటీవల సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి సినిమా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొంతమంది ఈ టైటిల్ వెరైటీగా ఉందంటుంటే, ఇంకొందరు ఇదేం టైటిల్ అంటూ సాగదీసి మాట్లాడుతున్నారు. ‘సాలా క్రాస్‌బీడ్’ అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చి విజయ్‌ని అందరికీ బావమరిదిని చేసేశాడు పూరి. ఇక సినిమా ఎప్పుడు తీసుకొస్తారో చెప్పడం ఒక్కటే బాకీ. దీనిపై ఓ పుకారు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
సినిమాను జులైలో విడుదల చేస్తారనేది తాజా పుకార్ల సారాంశం. 40 శాతం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఇంకా 60 శాతం చిత్రీకరణ బాకీ ఉంది. మూడు నెలల్లో సినిమా పూర్తి చేసే సామర్థ్యం ఉన్న పూరికి ఈ 60 శాతం పెద్ద విషయం కాదు. వచ్చే నెల మొదట్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలవుతుందని టాక్. వీలైనంత త్వరగా సినిమా ముగించి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారట. ఆ వెంటనే ప్రచారం.. బాలీవుడ్ రేంజి కాబట్టి ప్రచారం లాంగ్ షెడ్యూల్‌లో ఉంటుంది. అలా జులైలో సినిమా పక్కా అంటున్నారు.