Rajamouli: రాజమౌళి సినిమాల్లో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్న స్టార్ల లిస్ట్..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాల్లో చిన్న పాత్ర దక్కినా చాలు అనుకునే సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు.అది మన జక్కన్న రేంజ్. అయితే అదంతా ఇప్పుడు.!గతంలో ఈయన అపజయమెరుగని దర్శకుడు అని మనకి మాత్రమే తెలుసు. అయితే దేశమంతా తెలుసుకున్నది మాత్రం ‘బాహుబలి'(సిరీస్) తో..! అందుకేనేమో గతంలో రాజమౌళి కొంతమంది పరభాషా సెలబ్రిటీలను తన సినిమాల్లో నటించమని కోరితే వాళ్ళు రిజెక్ట్ చేశారు.నిజానికి ‘బాహుబలి’ ని బాలీవుడ్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలి అనుకున్నారు రాజమౌళి.అయితే అక్కడి సెలబ్రిటీలు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో టాలీవుడ్ స్టార్లతోనే ఆ ప్రాజెక్టుని తెరకెక్కించి ఇండియన్ వైడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు రాజమౌళి. ఇది పక్కన పెడితే.. రాజమౌళి సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తే మిస్ చేసుకున్న సెలబ్రిటీలు ఎవరు? వాళ్ళు మిస్ చేసుకున్న పాత్రలు ఏంటి? అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) శ్రీదేవి (బాహుబలి – శివగామి) :

తెలుగువారి సత్తాని ప్రపంచానికి చాటిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించమని రాజమౌళి మొదట శ్రీదేవిని కోరారు. అయితే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి ఈ ప్రాజక్ట్ కి దూరమయ్యారు. ఆ పాత్రను రమ్యకృష్ణ దక్కించుకొని అభినందనలను, అవకాశాలను పొందింది.

2) మంచు లక్ష్మి (బాహుబలి – శివగామి ) :

శివగామి పాత్రను శ్రీదేవి చేయనున్న తర్వాత ఆ ఆఫర్ మంచు లక్ష్మి వద్దకు వెళ్లింది. కానీ ప్రభాస్ కి తల్లిగా నటించడం ఇష్టం లేక రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ ని మంచు లక్ష్మి వదులుకుంది.

3) సూర్య (బాహుబలి) :

బాహుబలి సినిమాలో ఓ కీలక పాత్రకు ముందుగా తమిళ నటుడు సూర్యని జక్కన్న సంప్రదించారంట. అందుకు అయన ఒప్పుకోలేదు. ఈ విషయాన్నీ సికిందర్ ప్రమోషన్ సమయంలో సూర్య మీడియా ముఖంగా చెప్పుకున్నారు. ఆ ఛాన్స్ వదులుకున్నందుకు బాధపడ్డానని వెల్లడించారు.

4) వివేక్ ఒబెరాయ్ (బాహుబలి – భల్లాల దేవ) :

బాహుబలి చిత్రంలో ప్రభాస్ కి సమానంగా పోటీపడిన నటుడు రానా. అతను పోషించిన భల్లాల దేవ పాత్రకు ముందుగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ని అడిగారు. అయితే అతను ఇతర ప్రాజక్ట్ ల్లో బిజీగా ఉండడంతో అఫర్ ని తిరస్కరించారు.

5) సోనమ్ కపూర్ (బాహుబలి – అవంతిక) :

బాహుబలి సినిమాలో తమన్నా పోషించిన అవంతిక పాత్రకు మొదట బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ని బాహుబలి బృందం అడిగింది. అయితే ఆ ఆఫర్ ని తిరస్కరించింది. ఎందుకు వదులుకుందో కారణం మాత్రం చెప్పలేదు కానీ.. సోనమ్ కపూర్ వద్దన్న తర్వాత తమన్నా ఒకే చెప్పింది.

6) మోహన్ లాల్(కట్టప్ప) :

సినిమాకి ఈ పాత్ర వెన్నెముక్క లాంటిది. ‘బాహుబలి’ అనే పేరు వినగానే మనకి కట్టప్ప పాత్ర కూడా గుర్తుకొస్తుంది. అయితే ఈ పాత్రకి ముందుగా ఇద్దరు స్టార్లను సంప్రదించారు రాజమౌళి. అందులో మోహన్ లాల్ కూడా ఉన్నారు.

7) అమితాబ్ బచ్చన్(కట్టప్ప) :

కట్టప్ప పాత్ర కోసం బిగ్ బి అమితాబ్ ను కూడా సంప్రదించారు రాజమౌళి. కానీ ఆయన ఒప్పుకోలేదు. చివరికి సత్యరాజ్ ను ఫైనల్ చేశారు రాజమౌళి.

8) హృతిక్ రోషన్(బాహుబలి) :

‘బాహుబలి’ ఆలోచన వచ్చిన వెంటనే రాజమౌళి మైండ్లో మెదిలిన మొదటి వ్యక్తి హృతిక్ రోషన్. హిందీలో తీయాలి అనే ఆలోచన విరమించుకున్నప్పుడు ప్రభాస్ ను ఫైనల్ చేశారు రాజమౌళి.

9) జాన్ అబ్రహం(బాహుబలి) :

బల్లల దేవుడు పాత్రకి జాన్ అబ్రహంని కూడా అనుకున్నారు.

10) ప్రభాస్ (సింహాద్రి) :

ఎన్టీఆర్ కంటే ముందు ‘సింహాద్రి’ ని ప్రభాస్ తో అనుకున్నారు రాజమౌళి. కానీ ప్రభాస్ రిజెక్ట్ చేసాడు.

11) బాలకృష్ణ(‘సింహాద్రి) :

‘సింహాద్రి’ కథకి బాలయ్యని కూడా సంప్రదించారు. ‘మగధీర’ కథని కూడా బాలయ్యకి వినిపించారు. కానీ బాలయ్య ఇంట్రెస్ట్ చూపలేదు.

12) అర్చన (మగధీర ) :

మగధీర సినిమాలో శ్రీహరి పోషించిన సల్మాన్ పాత్రకు భార్య గా సలోని నటించింది. అయితే నిడివి ఎక్కువ కావడం వల్ల ఆమె నటించిన సీన్స్ తొలిగించారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఆ క్యారక్టర్ కి మొదట అర్చనని అడిగారు. కానీ చిన్న రోల్ అని ఒప్పుకోలేదు.

13) ప్రకాష్ కోవెలమూడి :

‘స్టూడెంట్ నెంబర్1’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఇతను ఓ మూవీ చేయాలి. కానీ ప్రకాష్ మొదటి సినిమా ‘నీతో’ ప్లాప్ అవ్వడంతో ఆ మూవీ కార్యరూపం దాల్చలేదు.

14) పవన్ కళ్యాణ్(విక్రమార్కుడు) :

పవన్ కళ్యాణ్ కోసం అనుకున్న ప్రాజెక్టు ఇది. కారణాలేంటో తెలీదు చివరికి రవితేజ చేసాడు.

15) డైసీ ఎడ్గర్ జోన్స్(ఆర్.ఆర్.ఆర్) :

భీం సరసన జెన్నీ పాత్ర కోసం ఈమెను అనుకున్నాడు రాజమౌళి. అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకుంది.

16) శ్రద్దా కపూర్(ఆర్.ఆర్.ఆర్) :

భీమ్ సరసన జెన్నీ పాత్ర కోసమే ఈమెను కూడా సంప్రదించాడు రాజమౌళి. కానీ ఈమె కాల్షీట్లు ఖాళీ లేవు అని తప్పుకుంది.

17) ఇజాబెల్లా కైఫ్(ఆర్.ఆర్.ఆర్) :

ఈమె కూడా భీమ్ సరసన జెన్నీ పాత్ర పోషించడానికి నిరాకరించింది. ఈమె కత్రినా కైఫ్ కు సిస్టర్ అవుతుంది అన్న సంగతి తెలిసిందే.

18) పరిణీతి చోప్రా(ఆర్.ఆర్.ఆర్) :

ఆలియా భట్ పోషించిన సీత పాత్రకి ముందుగా ఈమెను అనుకున్నారు. కానీ ఆమె ఈ ఆఫర్ ను వదులుకుంది.

19) అమీ జాక్సన్(ఆర్.ఆర్.ఆర్) :

భీమ్ సరసన జెన్నీ పాత్రని పోషించడానికి ఈమెను కూడా సంప్రదించారు. కానీ ఈమె కూడా ఈ ఆఫర్ ను వదులుకుంది.

20) కాజల్(యమదొంగ) :

ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ ను అనుకున్నారు. కానీ ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రియమణిని ఫైనల్ చేశారు. అటు తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ లో కాజల్ కు ఛాన్స్ దక్కింది.

Share.