2021లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

తెలుగు సినిమాకి మాత్రమే కాదు యావత్ ప్రపంచ సినిమాకు 2021 ఎప్పటికీ మర్చిపోలేని ఒక చేదు జ్ణాపకం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ నానా ఇబ్బదులుపడ్డారు. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తారతమ్యాలు మాయమయ్యాయి. బడ్జెట్ తో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా ఒటీటీ బాటపట్టడం కామన్ అయిపోయింది. థియేటర్లో రిలీజ్ చేసినా.. జనాలు వస్తారో రారో అనే భయం. అయితే.. ఈ కష్టకాలంలో కరోనా భయాన్ని జయించడమే కాక, జనాల్ని థియేటర్ కు రప్పించగలిగిన కొన్ని సినిమాలను బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ 2021గా పేర్కొన్నాం. కలెక్షన్స్ బట్టి కాకుండా ఆడియన్స్ రిసెప్షన్ బట్టి ఈ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మేమేమైనా మిస్ అయ్యామనిపిస్తే కామెంట్ బాక్స్ లో చెప్పగలరు.

క్రాక్

రవితేజ కెరీర్ అయిపోయింది, ఇక ఆ సింమియాలు ఎవడు చూస్తాడు అని కొందరు హేళన చేయడం మొదలెట్టారు. అలాంటి తరుణంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా “క్రాక్”. రవితేజ మాస్ పల్స్ ఎలా ఉంటుందో పరిచయం చేయడమే కాదు.. రవితేజ బాక్సాఫీస్ స్టామినాను తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు మరోసారి పరిచయం చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ సినిమా “సేతుపతి”కి రీమేక్ అయినప్పటికీ.. ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు గోపీచంద్. 2021కి మాస్ జాతరను పరిచయం చేసిన సినిమా ఇది.

ఉప్పెన

ఒక కొత్త హీరో, ఇంకో కొత్త హీరోయిన్, క్లైమాక్స్ ఏమిటో ముందే తెలిసిపోయింది. అయినప్పటికీ.. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేసిన సినిమా ఇది. ఒక సాధారణ ప్రేమకథగా రూపొంది ఘన విజయం సొంతం చేసుకుంది. మెగా కుటుంబం నుంచి వైష్ణవ్ తేజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం 2021లో విడుదలైన ఘన విజయం సొంతం చేసుకున్న చిన్న చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాకి సేతుపతి స్క్రీన్ ప్రెజన్స్ బిగ్గెస్ట్ ప్లస్ అవ్వగా.. ఆయన పాత్రకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం పెద్ద మైనస్.

నాంది

అల్లరి నరేశ్ లోని నటుడ్ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం “నాంది”. దర్శకనిర్మాతలు కొత్తవారు కావడం, కాన్సెప్ట్ లో నిజాయితీ ఉండడం సినిమాకి ప్లస్ అయ్యాయి. నిజానికి నరేష్ కు దాదాపు 10 ఏళ్ల తర్వాత లభించిన హిట్ అని కూడా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Ad Infinitum

అసలు ఈ సినిమా విడుదలైందో లేదో అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ.. థియేటర్లో, అమెజాన్ ప్రైమ్ లో చూసిన ప్రతి ఒక్కర్ని కంటెంట్ తో ఆశ్చర్యచకితుల్ని చేసిన సినిమా ఇది. మహాభారతం రిఫరెన్సులతో.. ఒక మోడ్రన్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మంచి పబ్లిసిటీ చేసి ఉంటే ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేది.

జాతి రత్నాలు

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నవ్వులతో దద్దరిల్లేలా చేసిన సినిమా “జాతిరత్నాలు”. అనుదీప్ దర్శకత్వంలో నవీన్-ప్రియదర్శి-రాహుల్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా కలెక్షన్ల వైజ్ చిన్నసైజు సునామీ సృష్టించిందనే చెప్పాలి. అయితే.. ఈ సినిమా జనాలకి చేరువవ్వడానికి నవీన్ & టీం చేసిన ప్రమోషన్స్ కీలకపాత్ర పోషించాయి. ఇకపోతే.. ఈ సినిమాను ఒటీటీలో చూసి “ఇందులో ఏముంది?” అని ప్రశ్నించినవారూ లేకపోలేదు.

వకీల్ సాబ్

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా. కరోనా, 50% ఆక్యుపెన్సీ, రీమేక్ సినిమా లాంటి అన్నీ అడ్డంకులను దాటుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హయ్యస్ట్ ఓపెనింగ్స్ సంపాదించిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ కు కొద్దిపాటి నష్టాలను మిగిల్చినా.. నిర్మాతగా దిల్ రాజు & బోణీ కపూర్ లు మాత్రం భారీ లాభాలు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం సూపర్ హ్యాపీ అయిపోయి.. దర్శకుడు వేణు శ్రీరామ్ కు ఏకంగా మాస్ గాడ్ అనే బిరుదు ఇచ్చేశారు.

రాజ రాజ చొర

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకున్న సినిమాల్లో ఇదొకటి. శ్రీవిష్ణు, మేఘ ఆకాష్, సునైన, రవిబాబుల నటన, హాసిత్ గోలి కథ-కథనం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. నవతరం జీవన విధానానికి, యూత్ తెలుసుకోవాల్సిన కొన్ని జీవిత సత్యాలను సింపుల్ వేలో చెప్పారు చిత్రబృందం.

లవ్ స్టోరీ

2019 నుంచి షూటింగ్ జరుపుకుంటూ.. ఎట్టకేలకు విడుదలైన చిత్రమిది. నటుడిగా నాగచైతన్యలోని పరిణితిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా. అలాగే.. నటిగా సాయిపల్లవిలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. ఫ్యామిలీస్ లో జరిగే చాలా హేయమైన అంశాలను కళాత్మకంగా, ఆలోజింపజేసే విధంగా తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల.

అఖండ

క్రాక్ తో రవితేజ ఈ ఏడాది మొదలెట్టిన మాస్ జాతరను ఇయర్ ఎండింగ్ కి కంటిన్యూ చేసిన సినిమా “అఖండ”. జనాలు థియేటర్లకు రారు అనే స్థాయి నుంచి మంచి సినిమా పడితే కలెక్షన్ల జల్లు ఖాయం అని నిర్మాతలకు ఒక ఆసరా ఇచ్చిన సినిమా ఇది. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపం, తమన్ సంగీతం, బోయపాటి ఎలివేషన్స్ ఆడియన్స్ కు సూపర్ హై ఇచ్చాయి. బాలయ్య కెరీర్ లోనే ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి.

పుష్ప: ది రైజ్

పాన్ ఇండియన్ సినిమా అన్నారు, కనీసం తెలుగులో కూడా ప్రమోట్ చేయడం లేదేంటి అనే హేళనతో మొదలై.. ఎలాంటి హడావుడి లేకుండా విడుదలై, నెగిటివ్ రివ్యూలు, యావరేజ్ టాక్ దక్కించుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా “పుష్ప: ది రైజ్”. అల్లు అర్జున్-సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడో చిత్రం.. 2021లో విడుదలైన ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెకండ్ పార్ట్ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలవ్వనుంది.

శ్యామ్ సింగరాయ్

నటుడిగా నాని చాన్నాళ్ల తర్వాత సరికొత్తగా చూపించిన సినిమా “శ్యామ్ సింగరాయ్”. బెంగాలీ బ్యాక్ డ్రాప్ తో, దేవదాసీ వ్యవస్థ మూలకథతో రాహుల్ తెరకెక్కించిన ఈ చిత్రం మూడేళ్ళ తర్వాత నానికి లభించిన థియేట్రికల్ రిలీజ్. నాని కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఆంధ్రాలో టికెట్ ఇష్యూస్ లేకపోతే ఇంకాస్త భారీ వసూళ్లు సంపాదించేది.

Share.