పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా కారణంగా.. రిలీజ్ డేట్ మారుతూ వచ్చింది ‘కింగ్డమ్’ సినిమా. ఈ సినిమా కూడా దాదాపు 5 సార్లు వాయిదా పడింది. ఫైనల్ గా జూలై 31కి ఫిక్స్ అని అనౌన్స్ చేశారు. వాస్తవానికి జూలై 25 నే ‘కింగ్డమ్’ రిలీజ్ చేయాలని అనుకున్నారు. పవన్ సినిమాకి పోటీగా వదలాలనే ఉద్దేశంతో కాదు. నెట్ ఫ్లిక్స్ వారి కండిషన్ మేరకు 5 వారాల థియేట్రికల్ అగ్రిమెంట్ అనమాట.
కానీ వీరమల్లు కూడా ఇప్పుడు వెనక్కి జరగాల్సి వచ్చింది. అంటే ‘కింగ్డమ్’ కి 4 వారాల్లో థియేట్రికల్ రన్ ముగుస్తుంది. లెక్క ప్రకారం చూసుకుంటే ‘కింగ్డమ్’ కి ఆ 4 వారాలు కూడా సోలో రన్ ఉండదు. టాక్ బాగుంటే సరిగ్గా 2 వీకెండ్లు క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
అటు తర్వాత ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘అతడు’ రీ- రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని కనీవినీ ఎరుగని విధంగా రీ- రిలీజ్ చేయనున్నారు. కనీసం 3,4 రోజుల రన్ ఉంటుంది. ఆ వెంటనే అంటే ఆగస్టు 14న రజినీకాంత్ ‘కూలి’, ఎన్టీఆర్- హృతిక్..ల ‘వార్ 2’ వచ్చేస్తుంది.
ఆ తర్వాత పూర్తిగా ఆ సినిమాల డామినేషనే బాక్సాఫీస్ పై ఉంటుంది. సో ‘కింగ్డమ్’ కి స్పేస్ ఉండదు. సో ఎలా చూసుకున్నా ‘కింగ్డమ్’ 7 నుండి 9 రోజుల్లోనే పెట్టుబడి మొత్తం రాబట్టుకోవాలి. విజయ్ దేవరకొండ ఈ సినిమాపైనే చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి ఇక.