ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే.. దాన్ని మార్కెట్ చేసుకోవడం చాలా కష్టం. సినిమాని మార్కెట్ చేసుకోవడానికి మంచి ప్రమోషన్ అవసరం. ఈ విషయంలో పెద్ద పెద్ద దర్శకులు కూడా ఫెయిల్ అవుతున్నారు. కానీ మన అనిల్ రావిపూడి మాత్రం… ఈ విషయంలో 100 శాతం సక్సెస్ అవుతున్నాడు. ప్రస్తుతం అతను మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘రఫ్ఫాడించేద్దాం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ఆల్రెడీ 2 షెడ్యూల్స్ షూటింగ్ ఫినిష్ అయ్యింది. దీని కంటే ముందుగా చిరు ‘విశ్వంభర’ చిత్రాన్ని కంప్లీట్ చేశారు. కానీ ఆ సినిమా ప్రమోషన్స్ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. సెప్టెంబర్లో రిలీజ్ అన్నారు. అలాంటప్పుడు ప్రమోషన్స్ ఎలా ఉండాలి. కానీ ‘విశ్వంభర’ ప్రమోషన్ జాడే కనిపించడం లేదు.
కానీ ‘మెగా 157’ ని మాత్రం అనిల్ పరుగులు పెట్టిస్తున్నాడు. ఓ పక్క షూటింగ్ నిర్వహిస్తున్నాడు.. సమాంతరంగా ప్రమోషన్స్ కూడా కానిచ్చేస్తున్నాడు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి అనిల్ తన ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం అతను ఓ బుల్లితెర షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలో పాల్గొంటున్న ఓ చిన్న పాపని చిరు సినిమా కోసం తీసుకున్నాడు.
ఆ పాపతో కూడా ప్రమోషన్ చేయించేశాడు. ‘నీకు అసలు సినిమాలో ఛాన్సే లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో’ అంటూ ఆ పాపని అనిల్ తిడుతుంటే.. వెంటనే ఆ పాప చిరు కార్ వ్యాన్ వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చినట్టు చూపించి వీడియోని కట్ చేశారు. ‘మెగా సపోర్ట్’ అంటూ నెక్స్ట్ ఎపిసోడ్లో చిరు ఆ పాపకి సపోర్ట్ చేసినట్టు చూపిస్తారన్న మాట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.