‘మొగలి రేకులు’ సీరియల్ తో బాగా పాపులర్ అయిన సాగర్.. తర్వాత హీరోగా మారి హీరోగా ‘సిద్ధార్థ’ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ‘షాదీ ముబారక్’ వంటి సినిమాలు చేశాడు. అయితే అవేవీ విజయం సాధించలేదు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో చేసిన ఫ్రెండ్ రోల్ మాత్రం అందరికీ బాగానే గుర్తుంది. అయితే ఆ సినిమా ఇష్టం లేకుండా చేసినట్టు తెలిపి షాకిచ్చాడు సాగర్. తన ‘ది 100’ అనే సినిమా ఈ వారం అంటే జూలై 11న విడుదల కానుంది.
దీని ప్రమోషన్స్ లో భాగంగా సాగర్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ గురించి చేసిన కామెంట్స్ అందరికీ షాకిచ్చాయి. “అయ్యో అనవసరంగా ఈ సినిమా చేశాను అని రిగ్రెట్ ఫీల్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా?’ అంటూ యాంకర్ సుమ ప్రశ్నించగా.. అందుకు సాగర్ ‘ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘ అనే సమాధానం ఇచ్చి షాక్ కి గురి చేశాడు. అటు తర్వాత అతను మాట్లాడుతూ… ” ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనేది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. ‘మొగలిరేకులు’ తో నేను పీక్ లో ఉన్నప్పుడు నాకు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఛాన్స్ వచ్చింది.
అందులో ప్రభాస్ గారి ఫ్రెండ్. ఆల్మోస్ట్ సెకండ్ లీడ్ అని చెప్పారు. ఆ టైంలో నేను 24 డేస్ డేట్స్ అడిగారు. అది చాలా కష్టమైంది. అయితే పెద్ద బ్యానర్లో వచ్చిన ఆఫర్ కదా మిస్ చేసుకోకూడదు అని భావించి ఓకే చేశాను. కానీ నేను సెట్స్ కి వెళ్ళిన తర్వాత నేను ఆశించినది ఏమీ అక్కడ జరగడం లేదు. 3 రోజులు నన్ను ఖాళీగా కూర్చోబెట్టారు. తర్వాత నాకు చెప్పిన సీన్స్ తీయడం లేదు. దీంతో నేను వెళ్లి దర్శకుడు దశరథ్ గారిని అడిగాను. దానికి ఆయన ‘అర్థం చేసుకోండి.. అప్పుడప్పుడు క్యారెక్టర్స్ మారతాయి’ అని చెప్పారు.
అప్పుడు నేను.. ‘వద్దులెండి.. నాకు ఎంట్రీ బాగుండాలని చేయడానికి ఒప్పుకున్నాను. డబ్బుల కోసం కాదు. కావాలంటే ఆ పాత్రని వేరే వాళ్ళతో చేయించుకోండి’ అని చెప్పి వచ్చేశాను. కానీ సినిమాలో నా రోల్ ఉంచారు. అది నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. కానీ ఆ సినిమా వల్లే నాకు హీరోగా చేయాలనే ఆసక్తి పెరిగింది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో నేను సెకండ్ లీడ్ అన్నారు. కానీ తర్వాత నా రోల్ మొత్తం మార్చేశారు. ఆ సినిమా వల్ల నా ఇమేజ్ కి చాలా డ్యామేజ్ జరిగింది : ఆర్.కె.సాగర్ #Prabhas #MrPerfect #RKsagar #The100 pic.twitter.com/XnvahjrV50
— Phani Kumar (@phanikumar2809) July 8, 2025