సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు కానీ ఒక్క మహేష్ తప్ప అందరూ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు వెళ్ళిపోయారు. ఆయన పెద్దకొడుకు రమేష్ బాబు పలు సినిమాల్లో హీరోగా నటించారు కానీ ప్రేక్షకులు అతన్ని వోన్ చేసుకోలేదు. నరేష్ గారి అబ్బాయి నవీన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ అతన్ని కూడా జనాలు పట్టించుకోలేదు. సుధీర్ బాబు హీరోగా నిలదొక్కుకోవడానికి కిందా మీదా పడుతున్నాడు.కృష్ణ గారి మనవడు గల్లా అశోక్ కూడా ‘హీరో’ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కానీ అతని పై ప్రేక్షకులకి అంచనాలు లేవు. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ క్రేజ్ భారం అంతా మహేష్ పైనే ఉంది. అందుకే అతను ఒక్కో సినిమాని ఆచి తూచి సెట్స్ పైకి తీసుకెళ్తుంటాడు.
ఈ దశలో చాలా సినిమాలను అతను మిస్ చేసుకున్నాడు. ‘ఇడియట్’ ‘గజినీ’ ’24’ ‘సికందర్’ ‘స్నేహితుడు(3 ఇడియట్స్ రీమేక్) ఇలా పెద్ద లిస్టే ఉంది. అయితే కొన్ని సినిమాలు అనౌన్స్ చేసినప్పటికీ కొన్ని కారణాల వలన సెట్స్ పైకి వెళ్ళలేదు. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) హరేరామ హరేకృష్ణ : మహేష్ బాబు- త్రివిక్రమ్- యం.ఎస్.రాజు కాంబినేషన్లో రూపొందాల్సిన సినిమా ఇది. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు కానీ అది సెట్స్ పైకి వెళ్ళలేదు.
2)శివమ్ : క్రిష్- మహేష్ బాబు కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సినిమా ఇది. సోనాక్షి సిన్హాని ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చలేదు.
3)మణిరత్నం- విక్రమ్- మహేష్ బాబు కాంబినేషన్లో కూడా ఓ సినిమాని అనౌన్స్ చేశారు. కానీ అది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు.
4) మిర్చి : జస్తీ హేమాంబర్ దర్శకత్వంలో ‘దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై ఈ చిత్రం ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
5)మిస్టర్ పర్ఫెక్ట్ : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘ఆర్.ఆర్.మూవీ మేకర్స్’ వారు ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. కానీ ఇది సెట్స్ పైకి వెళ్ళలేదు.
6)స్నేహితుడు : ‘3 ఇడియట్స్’ రీమేక్ అయిన స్నేహితుడులో కూడా మహేష్ బాబు హీరోగా చేస్తాడని నిర్మాతలు ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో అది విజయ్ చేతికి వెళ్ళింది.
7)అతడే : వినాయక్ -మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందాల్సిన సినిమా ఇది. కానీ ఆరంభ దశలోనే ఆగిపోయింది.
8)జన గణ మన : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు చెయ్యాల్సిన సినిమా ఇది. ఇప్పటికీ సెట్స్ పైకి వెళ్ళలేదు. వేరే హీరోతో చేయడానికి పూరి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపాడు కానీ.. అది వర్కౌట్ అవ్వడం లేదు.
9) బోయపాటి శ్రీను – మహేష్ కాంబినేషన్లో ఓ మూవీ ఉంటుందని ప్రకటన వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
10) మెహర్ రమేష్- మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని ప్రకటన వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ అని కూడా ప్రకటించారు. కానీ మెహర్ సినిమాల ఫలితాల వల్ల ఇది మూలాన పడిపోయింది.
ఇవి మాత్రమే కాదు కోడిరామ కృష్ణగారి దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ, కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఓ మెడికల్ మాఫియా మూవీ, గుణశేఖర్ దర్శకత్వంలో ‘వీరుడు’ ‘సైన్యం’ అనే సినిమాలు కూడా ప్రకటనలతోనే ఆగిపోయాయి.