స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈరోజుతో అంటే మార్చ్ 28తో 20 ఏళ్ళు పూర్తయిన సంగతి తెలిసిందే. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ చిత్రంతో అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం 2003 వ సంవత్సరం మార్చ్ 28న రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాలో అల్లు అర్జున్ లుక్స్ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు. ఆ సినిమా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం అది..
రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందే 100వ చిత్రం అనే హైప్ కారణంగా అలాగే కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలు అలాగే సమ్మర్ సీజన్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. అయితే ‘ఆర్య’ తో తన లుక్స్ ను కంప్లీట్ గా మార్చుకుంది యూత్ ఐకాన్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఈరోజు అతను ‘పుష్ప’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం అతను ‘పుష్ప 2’ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.
ఇది పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కెరీర్లో కొన్ని ప్రాజెక్టులు అనౌన్స్మెంట్ దశలోనే ఆగిపోయాయి. అవేంటంటే :
1) అల్లు అర్జున్ – లింగుస్వామి :
‘పందెం కోడి’ ‘ఆవారా’ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన లింగుస్వామి.. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
2) అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ :
అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు.
3) అల్లు అర్జున్ – కొరటాల శివ :
వీరి కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ‘ఆచార్య’ రిజల్ట్ వల్లో ఏమో .. అల్లు అర్జున్ (Allu Arjun) వెనక్కి తగ్గాడు.