టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారని అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకు ముందే కేవలం ఎనిమిది నెలల వయస్సులోనే నాగార్జున వెలుగు నీడలు అనే సినిమాలో కనిపించారు. ఏఎన్నార్ ఈ సినిమాలో హీరోగా నటించడం గమనార్హం. ఈ సినిమా తర్వాత నాగ్ సుడిగుండాలు అనే సినిమాలో బాల నటుడిగా కనిపించి తన నటనతో మెప్పించారు. తెలుగులో దాదాపుగా అన్ని జానర్లలోని సినిమాలలో నాగ్ నటించడం గమనార్హం.
అటు మాస్ సినిమాలతో ఇటు క్లాస్ సినిమాలతో విజయాలను అందుకున్న అతికొద్ది మంది హీరోలలో నాగార్జున ఒకరు కావడం గమనార్హం. నాగార్జున త్రిమూర్తులు, రావుగారిల్లు, ఘటోత్కచుడు, నిన్నే ప్రేమిస్తా, స్టైల్, తకిట తకిట, దొంగాట, అధిపతి, అఖిల్, సైజ్ జీరో, ప్రేమమ్ సినిమాలలో గెస్ట్ రోల్స్ లో కనిపించి మెప్పించారు. ఎక్కువ సంఖ్యలో సినిమాలలో గెస్ట్ రోల్స్ లో నటించి ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో విజయాలను అందుకోవడం నాగార్జునకే సాధ్యమైంది.
తన సినీ కెరీర్ లో ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చిన నాగార్జున వాళ్ల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని చెబుతుండటం గమనార్హం. కొత్త డైరెక్టర్లు డైరెక్షన్ చేస్తే సినిమాకు కొత్తదనం వస్తుందని నా పాత్రలు కొత్తగా ఉండటంతో పాటు నటనలో వైవిధ్యం ఉంటుందని నాగ్ చెబుతున్నారు. గతంలో పోషించిన పాత్రల పేర్లు మార్చి కొత్తగా చేశామని చెప్పుకోవడం నాకు నచ్చదని నాగ్ చెబుతున్నారు.
కొత్త డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించిన సినిమాలతో నాకు విజయాలు దక్కాయని అదే సమయంలో నేను ఎదురుదెబ్బలు కూడా తిన్నానని నాగ్ కామెంట్లు చేస్తున్నారు. ఇతర హీరోలతో కలిసి నటించడానికి కూడా నాగార్జున ఎప్పుడూ సిద్ధంగా ఉంటారనే సంగతి తెలిసిందే. నాగార్జున పలు సినిమాలలో పాటలు పాడగా ఆ పాటలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి నాగార్జున క్రేజ్ ను మరింత పెంచాయి.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!