ఈరోజు మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) పుట్టినరోజు. దీంతో చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో అతని బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను ఓ రేంజ్లో ట్రెండ్ చేస్తున్నారు. చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమాలో యాక్టింగ్ లో కింగ్ అయిన ఎన్టీఆర్ నే డామినేట్ చేసే విధంగా నటించి మెప్పించాడు. రామరాజు పాత్రలో చాలా ఎమోషన్ దాగి ఉండటం.. అలాగే ఆ పాత్రకు చరణ్ తన లుక్, పెర్ఫార్మన్స్ తో జీవం పోయడంతో విదేశాల్లో కూడా రాంచరణ్ కు వీరాభిమానులు ఏర్పడ్డారు. ఆస్కార్ కు ముందు చరణ్ తో చాలా మంది విదేశీయులు టీవీ షోలు, ఇంటర్వ్యూలు వంటివి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ బర్త్ డే రాంచరణ్ కు చాలా స్పెషల్ కాబట్టే.. అభిమానులు కూడా పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. రాంచరణ్ ఇప్పటివరకు ‘చిరుత’ ‘మగధీర’ ‘రచ్చ’ ‘నాయక్’ ‘ఎవడు’ ‘ధృవ’ ‘రంగస్థలం’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు. మధ్యలో కొన్ని ప్లాప్ లు తగిలినా అవేవీ కూడా చరణ్ ఇమేజ్ ను తగ్గించలేకపోయాయి. అయితే మధ్యలో చరణ్ కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే అధికారిక ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా చరణ్ నటించిన కొన్ని సినిమాలు ఆగిపోయాయి. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1) మెరుపు :
పవన్ కళ్యాణ్ తో ‘బంగారం’ చిత్రం చేసిన దర్శకుడు ధరణి.. రాంచరణ్ తో ‘మెరుపు’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. కొంత పార్ట్ షూటింగ్ కూడా జరిగింది.సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. కాజల్ హీరోయిన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
2) రాంచరణ్ – కొరటాల శివ – బండ్ల గణేష్ :
ఈ కాంబినేషన్లో కూడా ఓ సినిమా అనౌన్స్ చేశారు. ‘ఎవడు’ తర్వాత రావాల్సిన సినిమా ఇది. తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళలేదు.
3) రాంచరణ్ – కొరటాల శివ – మైత్రి మూవీ మేకర్స్ :
ఈ కాంబినేషన్లో కూడా సినిమా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు కూడా తెలిపారు.
4) రాంచరణ్ – గౌతమ్ తిన్ననూరి :
రాంచరణ్ తన 16వ సినిమాని ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ‘యూవీ.క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాలి. కానీ ఎందుకో ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు.