బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ సినిమాలు హాలీవుడ్ రేంజ్ మేకింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.. ఇంతకుముందు వరకు ఓ లెక్క.. ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్టు వరల్డ్ బాక్సాఫీస్ బరిలో వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తూ.. హాలీవుడ్ వాళ్లను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఇండియన్ సినిమాలు… ఆమిర్ ఖాన్ సెట్ చేసిన వెయ్యి కోట్ల మార్క్ అనేది ఇప్పటికీ సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది.. ‘దంగల్’ నుండి షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ వరకు వరల్డ్ వైడ్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం..
1) దంగల్..
బాలీవడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటిస్తూ.. వాల్ట్ డిస్నీ సంస్థతో కలిసి నిర్మించిన బయోగ్రఫికల్ స్పోర్ట్స్ డ్రామా.. ‘దంగల్’.. నితేష్ తివారి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. ప్రపంచవ్యాప్తంగా.. రూ. 2 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా సత్తా చాటింది.. ‘దంగల్’ క్రియేట్ చేసిన ఈ రికార్డ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..
2) బాహుబలి : ది కన్‌క్లూజన్..
‘దంగల్’ తర్వాత సెకండ్ ప్లేసులో నిలిచింది తెలుగు సినిమా.. దర్శకధీరుడు రాజమౌళి తీసిన విజువల్ వండర్.. ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’.. ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 1788.6 కోట్ల వసూళ్లు సాధించింది..
3) కె.జి.యఫ్ 2..
యావత్ ప్రపంచం చూపు కన్నడ ఇండస్ట్రీ వైపు తల తిప్పి చూసేలా చేసిన చిత్రం ‘కె.జి.యఫ్’.. దాని సీక్వెల్‌గా భారీ అంచనాలతో వచ్చిన ‘కె.జి.యఫ్ 2’ రికార్డ్ రేంజ్‌లో రూ. 1208 కోట్లు రాబట్టింది..
4) ఆర్ఆర్ఆర్..
రాజమౌళి మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించి.. తెలుగు సినిమా స్టామినాని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లి.. హాలీవుడ్, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వరకు తీసుకెళ్లిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చిన ట్రిపులార్ జపాన్‌లో దుమ్ము దులుపుతోంది.. రూ. 1155 కోట్లు కుమ్మరించింది..
5) పఠాన్..
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాక.. గతకొద్ది కాలంగా సరైన సినిమాలు లేక డీలా పడ్డ బాలీవుడ్ ఇండస్ట్రీ పరువు కాపాడాడు.. ఫస్ట్ డే నుండే రికార్డ్ రేంజ్ వసూళ్లతో సత్తా చాటుతూ.. ఐదు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ టచ్ చేసింది ‘పఠాన్’.. తొలి వారంలో ఏకంగా రూ.640 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తాజాగా రూ.1000 కోట్ల మార్క్ టచ్ చేసి.. వరల్డ్ బాక్సాఫీస్‌కి ఇండియన్ సినిమా స్టామినా ఏంటనేది మరోసారి రుచి చూపించింది..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?