కరోనా 2.ఓ ఏ రేంజ్లో విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీని దెబ్బకు మళ్ళీ థియేటర్లు మూతపడుతున్నాయి. చాలా వరకూ పెద్ద సినిమాల షూటింగ్లు నిలిచిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. దీని భారిన పడితే లక్షల్లో హాస్పిటల్ బిల్లులు కట్టాల్సి వస్తుంది.అలా అని ఎన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నా.. దీని భారినుండీ తప్పించుకోవడం సామాన్యులకు మాత్రమే కాదు..సెలబ్రిటీల వల్ల కూడా సాధ్యపడటం లేదు. పెద్ద పెద్ద హీరోల దగ్గర పనిచేసే వారు కూడా దీని భారిన పడి మృత్యువాత పడుతుండడం గమనించాల్సిన విషయం. వీటిని దృష్టిలో పెట్టుకునే.. కొంతమంది టాలీవుడ్ హీరోలు సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధం.. అదే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటున్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరో ఓ లుక్కేద్దాం రండి :
1) పవన్ కళ్యాణ్ :
ఈ మధ్యనే కరోనా బారిన పడి కోలుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం తన ఫామ్ హౌజ్‌లోనే సెల్ఫ్ ఐసొలేషన్లో ఉంటున్నాడు. మరో రెండు వారాల వరకూ అతను బయటకు రాడట.
2) ప్రభాస్ :
తన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్‌కు కరోనా సోకడంతో సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్ళిపోయాడు ప్రభాస్. గతంలో అంటే.. 2020లో లాక్ డౌన్ ఏర్పడటానికి ముందు కూడా ఇలాగే హోమ్ ఐసోలేషన్లో ఉండిపోయాడు.
3) మహేష్ బాబు :
తన ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్లో కొంతమందికి కరోనా సోకింది. అంతేకాక మహేష్ పర్సనల్ స్టైలిస్ట్ కూడా కరోనా భారిన పడ్డాడు. దీంతో తన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని.. సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయాడు.
4) రాంచరణ్ :
ఈ మధ్యనే తన కార్ వ్యాన్ డ్రైవర్ కరోనాతో మరణించాడు. అలాగే కరోనా సోకిన టైములో పవన్ వద్దకు కూడా వెళ్ళొచ్చాడు. దీంతో అపోలో వైద్యుల సలహాతో సెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్ళిపోయాడు. గతంలో చరణ్ కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే.
5) ఎన్టీఆర్:
‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఈ మధ్యనే ఆగిపోయింది. చిత్ర యూనిట్ సభ్యుల్లో కొంతమంది కరోనా భారిన పడటంతో దర్శకుడు రాజమౌళి షూటింగ్ ను ఆపేసాడు.దాంతో ఆ టైములో ఎన్టీఆర్ సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్ళిపోయాడట.
6) అల్లు అర్జున్ :
కొద్దిరోజుల నుండీ బన్నీ కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటున్నట్టు టాక్. ‘పుష్ప’ టీజర్ లాంచ్ తరువాత బన్నీ సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్ళిపోయాడట.
7) చిరంజీవి :
మన మెగాస్టార్ కూడా ‘ఆచార్య’ షూటింగ్ ఆపేసి ఐసోలేషన్ కు వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమాకి తన ఫ్యామిలీతో వెళ్లొచ్చిన తరువాత చిరు ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో చిరు కూడా కరోనా భారిన పడ్డారు.
8) వెంకటేష్ :
‘దృశ్యం 2’ షూటింగ్ పూర్తయిన తరువాత వెంకటేష్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లిపోయారట.
9) రవితేజ :
‘ఖిలాడి’ దర్శకుడు రమేష్ వర్మ కరోనా భారిన పడటంతో షూటింగ్ ఆగిపోయింది. దాంతో రవితేజ సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్ళిపోయాడట.
10) నాగ చైతన్య :
ఇటీవల నాగ చైతన్య కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయాడట.