Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!
- July 17, 2025 / 12:30 PM ISTByPhani Kumar
ఇటీవల కన్నడ సినిమా ‘కేడి ది డెవిల్’ ప్రమోషన్స్ లో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ పాల్గొన్నారు. ఈ సినిమాలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ‘లియో’ సినిమా గురించి ఆయన స్పందించడం జరిగింది.ఆ సినిమా వల్ల ‘దళపతి విజయ్ తో పనిచేసే అవకాశం లభించిందని, అందుకు ఆయన చాలా ఆనందంగా ఫీల్ అయ్యారట.
Lokesh Kanagaraj, Sanjay Dutt
విజయ్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ ని కూడా సంజయ్ దత్ ఎంజాయ్ చేశారట. కానీ లోకేష్ కనగరాజ్ తనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ కలిగిన పాత్ర ఇవ్వలేదని, తనని సరిగ్గా వాడలేదని’ ఆయన మనసులో మాటని బయటపెట్టారు. దీంతో సంజయ్ దత్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

- 1 Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!
- 2 విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!
- 3 Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!
- 4 Pan-India Movies: ఆ పాన్ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్ టేబుల్ మీదకు వస్తాయా?
ఇవి దర్శకుడు లోకేష్ వరకు రీచ్ అయ్యాయి. తాజాగా ‘కూలి’ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన ఈ విషయం పై స్పందించారు. ఈ సందర్భంగా లోకేష్.. సంజయ్ దత్ ని క్షమాపణలు కోరారు. ‘ఆయన మాటల్లో న్యాయం ఉంది. ‘లియో’ విషయంలో ఆయన్ని ఇంకా వాడాల్సింది. భవిష్యత్తులో కచ్చితంగా ఆయన ఇమేజ్ కి తగ్గట్టు లెంగ్త్ ఉన్న పాత్ర రాస్తాను.

ఆ లోటును పూడుస్తాను’ అంటూ లోకేష్ తెలిపారు. ‘లియో’ సినిమాలో సంజయ్ దత్.. హీరో తండ్రి పాత్ర పోషించారు. కానీ మూఢనమ్మకాల వల్ల సొంత కొడుకు, కూతుర్నే చంపుకునే కసాయి తండ్రిగా నెగిటివ్ షేడ్స్ తీసుకుంటుంది ఆయన పాత్ర. ఫ్లాష్ బ్యాక్ లో అలా వచ్చి ఇలా మాయమైపోయే పాత్ర అది.















