‘రౌడీ బాయ్స్’ తో (Rowdy Boys) హీరోగా ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు (Dil Raju) వారసుడు ఆశిష్ (Ashish Reddy).. తన రెండో సినిమాగా ‘లవ్ మీ’ (Love Me) (ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక) చేశాడు. ‘బేబీ’ (Baby) ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, (Harshith Reddy) , హన్షిత రెడ్డి (Hanshitha Reddy) నాగ మల్లిడి కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల నుండీ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.

కీరవాణి (MM Keeravani) ,పీసీ శ్రీరామ్ (P. C. Sreeram) వంటి లెజెండ్స్ కూడా ఈ సినిమాకి చేయడంతో మంచి హైప్ ఏర్పడింది. కానీ మే 25న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. అయినా మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసింది.. కానీ రెండో రోజు నుండి కలెక్షన్స్ పడిపోయాయి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.83 cr |
| సీడెడ్ | 0.27 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.57 cr |
| ఏపీ + తెలంగాణ | 1.67 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.13 cr |
| ఓవర్సీస్ | 0.20 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 2.00 cr |
‘లవ్ మీ’ చిత్రం రూ.6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.2 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
