‘లవ్ టుడే’ని దాటుకొని అల్లరి నరేష్ హిట్ కొడతాడా..?

ఒకప్పుడు కామెడీ సినిమాలను కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తరువాతి కాలంలో బాగా డల్ అయ్యారు. ఆయన సినిమాలేవీ కూడా వర్కవుట్ కాకపోవడంతో రూటు మార్చారు. సీరియస్ తరహా పాత్రలను ఎన్నుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం ఆయన నటించిన ‘నాంది’ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. మొత్తానికి ఈ సినిమాతో అల్లరి నరేష్ కెరీర్ కి మంచి ఊపు వచ్చింది.

ఈ సినిమా హిట్ అయింది కదా అని ఎడాపెడా సినిమాలు చేయలేదు నరేష్. జాగ్రత్తగా తన నెక్స్ట్ సినిమాను సెట్ చేసుకున్నారు. ‘నాంది’ తరహాలోనే మరో సీరియస్ సబ్జెక్ట్ తో అతడు చేసిన సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఇది సామజిక అంశాలతో ముడిపడ్డ సినిమా. ‘నాంది’లానే ఒక సీరియస్ కాజ్ తో నడిచే సినిమా ఇది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఎంతవరకు ఆడుతుందో చెప్పలేం.

సినిమాకి మంచి టాక్ రావాలి. ఈ సినిమాకి పోటీగా డబ్బింగ్ సినిమా ‘లవ్ టుడే’ రిలీజ్ అవుతుంది. తమిళంలో చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా చర్చ నడుస్తోంది. తెలుగు ట్రైలర్ కూడా బాగుండడంతో యూత్ లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో డబ్బింగ్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. కంటెంట్ బాగుంటే మన ఆడియన్స్ డబ్బింగ్ సినిమాలను కూడా ఎగబడి చూస్తున్నారు.

టాక్ బాగుంటే ‘లవ్ టుడే’ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. పైగా దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మంచి పబ్లిసిటీ, థియేటర్స్ దొరుకుతాయి. మరి ఈ సినిమాను దాటుకొని అల్లరోడు హిట్ కొడతాడేమో చూడాలి!

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus