తెలుగు తెరపై తొలిసారి రోడ్-ట్రిప్ థ్రిల్లర్ రూపంలో ఓ వినూత్న కథ రాబోతోంది. ‘ఆన్ ది రోడ్’ టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం, పూర్తిగా లడఖ్ లోయల్లో, ప్రకృతి అందాల మధ్య చిత్రీకరించబడింది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సూర్య లక్కోజు, గతంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అనేక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం, ఆర్‌జీవీ స్వయంగా ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి ఆసక్తి పెరిగింది.
“ఓ యువకుడు, అనుకోకుండా లడఖ్ రోడ్ ట్రిప్ లో తన మాజీ ప్రియురాలిని కలుస్తాడు. అయితే ఆమె తన భర్తతో తన మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వెకేషన్ కి వస్తుంది. అదేమీ పట్టించుకోకుండా గతాన్ని గుర్తు చేస్తూ అతను… ఆమెను తనతో వచ్చేయమని సీరియస్ గా ప్రపోజ్ చేస్తాడు. ఈలోగా ఈ విషయం ఆమె భర్తకు కూడా తెలియటంతో వాళ్ల ముగ్గురి మధ్య ఎటువంటి ఘర్షణాత్మక సన్నివేశాలు జరిగియనేదే ఈ చిత్ర కథాంశం.
సస్పెన్స్, డ్రామా ప్రధానంగా సాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రల మధ్య భావోద్వేగాలతో కూడిన ఈ రోడ్ ప్రయాణం, లడఖ్ అందాలు, ప్రేక్షకులను ఎమోషనల్ గా కట్టిపడేస్తుందని నమ్ముతున్నాను” అని చెప్పారు.
SPL పిక్చర్స్ బ్యానర్‌పై సూర్య లక్కోజు మరియు రాజేష్ శర్మ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు అక్టోబర్ 10, 2025న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలకు సిద్ధమవుతోంది.
రచన మరియు దర్శకత్వం – సూర్య లక్కోజు
నిర్మాతలు : సూర్య లక్కోజు , రాజేష్ శర్మ
నటీనటులు : కర్ణ్ శాస్త్రి, స్వాతి మెహ్రా , రాఘవ్ టి, రవి సింగ్ ,
డిఓపి : గిఫ్టీ మెహ్రా
మాటలు : శ్రీనివాస్ కోమనాపల్లి
ఎడిటర్ : మందార్ సావంత్
సంగీత దర్శకులు : నవీన్ కుమార్ , సుర్‌భిత్ మనోచా
పిఆర్ఓ : మధు వి ఆర్
డిజిటల్ : డిజిటల్ దుకాణం