Bigg Boss 5 Telugu: కెప్టెన్ గా శ్రీరామ్ కి ఎందుకు సపోర్ట్ చేశాడు..!

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. దీనికి కరెక్ట్ ఉదాహరణ మానస్ గేమ్ గా చెప్పచ్చు. అప్పటివరకూ శ్రీరామ్ పోటీ చేస్తే కెప్టెన్సీలో నేను కూడా పోటీ చేస్తా అన్నాడు మానస్. కానీ, మానస్ కి శ్రీరామ్ కి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడే మానస్ ట్విస్ట్ ఇచ్చి మరీ సపోర్ట్ చేశాడు. ఇది హౌస్ మేట్స్ కి మాత్రమే కాదు ఆడియన్స్ కి కూడా షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

బిగ్ బాస్ హౌస్ లో కత్తులతో సావాసం అంటూ కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో మూడు జోడీలు కూడబలుక్కుని మరీ ముగ్గురుని ఎంచుకున్నాయి. హమీద శ్రీరామ్ ని, మానస్ సన్నీని, అనీమాస్టర్ శ్వేతని కెప్టెన్సీ పోటీదారులుగా నిలబెట్టారు. జోడీ నుంచీ వాళ్లు తప్పుకున్నారు. ఇక్కడే ఇమ్యానిటీ కోసం శ్రీరామ్ హమీదాని కన్విన్స్ చేశాడు. నిజానికి శ్రీరామ్ కెప్టెన్ గా నిలబడితే మానస్ నేను నిలబడతాను అంటూ సన్నీ తో చెప్పాడు. కానీ, సంచాలక్ కాజల్ కి లాస్ట్ వరకూ కూడా శ్రీరామ్ తన పేరుని రివీల్ చేయలేదు.

చెవిలో రహస్యంగా చెప్పాడు. దీంతో మానస్ చేసేదేమీలేక తమ జోడీ నుంచి సన్నీని బరిలోకి దింపాడు. ఇక సన్నీకి హౌస్ మేట్స్ పోటుపై పోటు వేస్తూ కారణాలు చెప్పారు. సన్నీకి వరుసగా కత్తిపోట్లు వస్తున్నా కూడా చాలా కూల్ గా అందరికీ ఆన్సర్ ఇచ్చాడు సన్నీ. ఇక్కడే తన పార్ట్ నర్ అయిన సన్నీని పొడవడం ఇష్టంలేని మానస్ శ్వేత ఇంకా శ్రీరామ్ లని ఇంప్రెస్ చేయమని అడిగాడు. దీంతో వాళ్లు మానస్ ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు.

ఇక మానస్ శ్వేతని ఉద్దేశ్యించి నీకు ఇంకా టైమ్ పడుతుందని నేను అనుకుంటున్నా, కెప్టెన్ గా శ్రీరామ్ అయితే అన్నీ బ్యాలన్స్ చేస్తాడని అనిపిస్తోంది అంటూ చెప్పి శ్వేతని పోటు పొడిచి ట్విస్ట్ ఇచ్చాడు. శ్రీరామ్ పై వ్యతిరేకంగా పోటీ చేస్తా అన్న మానస్ శ్రీరామ్ కి మద్దతు ఇచ్చేసరికి హౌస్ మేట్స్ అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఇదే విషయాన్ని స్ట్రయిట్ గా అడిగేద్దాం.. నిలదీద్దాం అంటూ సన్నీ జెస్సీతో ఇంకా శ్వేతతో చెప్పాడు. మరి ఈవిషయంలో రేపు మానస్ ఎలాంటి వివరణ ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus