నార్నె నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Shobhan), రామ్ నితిన్(Ram Nithin)..లు హీరోలుగా రూపొందిన ‘మ్యాడ్’ కి (MAD) సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) . ఉగాది కానుకగా మార్చి 28న రిలీజ్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. 3 సినిమాల మధ్య భారీ పోటీలో రిలీజ్ అయినా ‘మ్యాడ్ స్క్వేర్’ విన్నర్ గా నిలిచింది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమాకి.. సక్సెస్ మీట్ పెట్టి మరింత పుష్ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi ).
Mad Square Collections:
ఎన్టీఆర్ (Jr NTR) కూడా సక్సెస్ మీట్ కి రావడంతో సినిమాకు మరింత మైలేజ్ చేకూరినట్లు అయ్యింది. దీంతో రెండో వీకెండ్ ను కూడా ఈ సినిమా క్యాష్ చేసుకుంది.ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమాకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 10 రోజుల్లో రూ.34.37 కోట్లు షేర్ ను రాబట్టింది.