“మ్యాడ్” (MAD) సినిమా ఎంత పెద్ద హిట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్, ఆ సినిమాకి ఉన్న ఫ్యాన్ బేస్ సీక్వెల్ అనౌన్స్మెంట్ కి కారణమయ్యాయి. మ్యాడ్ టీమ్ ఈసారి మ్యాడ్ స్క్వేర్ (Mad Square) అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు నవ్వించిందో చూద్దాం..!!
కథ: మ్యాడ్ గ్యాంగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కథలతో ఫస్ట్ పార్ట్ ముగియగా, లడ్డుగాడి పెళ్లితో సీక్వెల్ మొదలవుతుంది. ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన లడ్డు (విష్ణు ఓయ్)కి (Vishnu Oi)స్నేహితులు (నార్నే నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Shobhan), రామ్ నితిన్ (Ram Nithin) అడ్డంకిగా మారతారు. దాంతో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది.
హనీమూన్ కి కొత్త పెళ్ళాంతో గోవా వెళ్దామనుకున్న లడ్డు గతిలేక స్నేహితులతో కలిసి గోవా వెళ్తాడు. అక్కడ మ్యాడ్ గ్యాంగ్ అనుకోని విధంగా భాయ్ (సునీల్)తో (Sunil) తలపడాల్సి వస్తుంది. అసలు మ్యాడ్ గ్యాంగ్ కి భాయ్ కి సంబంధం ఏమిటి? ఈ సమస్యల నుంచి మ్యాడ్ బ్యాచ్ ఎలా బయటపడ్డారు అనేది “మ్యాడ్ స్క్వేర్” (Mad Square) కథాంశం.
నటీనటుల పనితీరు: ఫస్ట్ పార్ట్ కి వచ్చిన క్రిటిసిజంను సీరియస్ గా తీసుకున్నట్లున్నాడు నార్నే నితిన్. నటుడిగా చాలా డెవలప్ అయ్యాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ & డైలాగ్ డెలివరీలో పరిణితి ప్రదర్శించాడు. ముగ్గురు హీరోలతో సమానంగా కనిపించాడు.
సంగీత్ శోభన్ ఎప్పట్లానే తనదైన కామెడీ టైమింగ్ తో ఇరగ్గొట్టాడు. రామ్ నితిన్ ఎనర్జీ & క్యూట్ లుక్స్ తో అలరించాడు. వీళ్లందరినీ డామినేట్ చేసిన నటుడు విష్ణు ఓయ్. కథ కూడా అతడి చుట్టూనే తిరగడం, పంచ్ డైలాగ్స్ అన్నీ అతడి మీదే ఉండడంతో బాగా ఎలివేట్ అయ్యాడు.
సునీల్ చాలా రోజుల తర్వాత తనదైన టైలర్ మేడ్ క్యారెక్టర్లో అలరించాడు. శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar) కొత్తగా కనిపించారు. ఆయన్ను ఈ తరహా వైవిధ్యమైన పాత్రల్లోనూ ఊహించుకోవచ్చు అని హింట్ ఇచ్చాడు దర్శకుడు. స్పెషల్ రోల్లో ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) గ్లామరస్ గా కనువిందు చేసింది. అనుదీప్ (Anudeep Kv) కాంబినేషన్ లో ప్రియాంక కనిపించే సీన్ బాగా పేలింది. మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) క్యారెక్టర్ మరోసారి గట్టిగా పేలింది. సునీల్ & మురళీధర్ గౌడ్ కాంబినేషన్ సీన్స్ కచ్చితంగా ఆకట్టుకుంటాయి.
సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. చాలా చోట్ల లోటుపాట్లు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకునే టైమ్ ఇవ్వలేదు దర్శకుడు. నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) చెప్పినట్లు కథ, కథనం, దాని బలం గురించి పట్టించుకునేంతలా మ్యాడ్ స్క్వేర్ లో కంటెంట్ ఏమీ లేదు. అయితే.. ఫస్టాఫ్ లో పండినంత కామెడీ సెకండాఫ్ లో మిస్ అయ్యింది. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఫార్మాట్ లో సాగే సినిమాలకి స్క్రీన్ ప్లేతో పెద్దగా పని లేనప్పటికీ.. కామెడీ లెవల్ అనేది ఎక్కడా తగ్గకూడదు. ఎక్కడైనా గ్రాఫ్ తగ్గిందా, ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు.
ఆ విషయంలో మాత్రం మ్యాడ్ టీమ్ పెద్దగా వర్క్ చేయలేదు అనిపించింది. కామెడీ గ్రాఫ్ అనేది సెకండాఫ్ లో పడుతూ లేస్తూ ఉంటుంది. అందువల్ల కన్సిస్టెంట్ గా సినిమాని ఎంజాయ్ చేయలేరు. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ లో క్యారెక్టర్స్ అన్నీ చాలా ఆర్గానిక్ గా ఉంటాయి. అందువల్ల సదరు పాత్రల ద్వారా పండించిన హాస్యానికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సీక్వెల్ లో ఆది మిస్ అయ్యింది. ఓవరాల్ గా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) “మ్యాడ్ స్క్వేర్”తో(Mad Square) పూర్తిస్థాయిలో అలరించలేకపోయాడనే చెప్పాలి.
విశ్లేషణ: కళ్యాణ్ శంకర్ కాస్త కంగారుగా సెకండాఫ్ ను కంగాళీ కథనంతో ముగించకుండా, ఇంకాస్త కామికల్ & సెన్సిబుల్ గా డీల్ చేసి ఉంటే “మ్యాడ్ స్క్వేర్” (Mad Square) కూడా “మ్యాడ్” రేంజ్ లో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుండేది. కామెడీ గ్రాఫ్ కాస్త తగ్గడం, సెకండాఫ్ లో లాజిక్స్ గట్రా పట్టించుకోకపోయినా మ్యాజిక్ కూడా వర్కవుట్ అవ్వకపోవడంతో “మ్యాడ్ స్క్వేర్” ఎబౌ యావరేజ్ ఎంటర్టైనర్ గా మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: కాస్త మందగించిన మ్యాడ్ ఎంటర్టైన్మెంట్!
రేటింగ్: 2.5/5