Madha Gaja Raja Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మదగజరాజ’ ..!
- February 5, 2025 / 07:07 PM ISTByPhani Kumar
విశాల్ (Vishal)హీరోగా అంజలి (Anjali), వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్లుగా ‘మదగజరాజ'(Madha Gaja Raja) అనే సినిమా రూపొందింది. తమిళ దర్శకుడు సుందర్ సి (Sundar C) తెరకెక్కించిన ఈ సినిమా 2012 లోనే రిలీజ్ కావాలి. అయితే ఆర్థిక సమస్యలు అలాగే పలు కేసుల వల్ల ఆగిపోయింది. మొత్తానికి అన్ని అడ్డంకులు తొలగించుకుని 12 ఏళ్ళ తర్వాత 2025 సంక్రాంతి కానుకగా తమిళ్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల ప్రేక్షకులకు ఈ సినిమానే ఆప్షన్ అయ్యింది.
Madha Gaja Raja Collections:

సంతానం,మనోబాల కామెడీ వర్కౌట్ అవ్వడంతో పాటు హీరోయిన్ల గ్లామర్ హైలెట్ అవ్వడం వల్ల ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. అందుకే జనవరి 31న తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడ మాత్రం ఈ సినిమాని జనాలు పట్టించుకోవడం లేదు.ప్రమోషన్స్ వంటివి సరిగ్గా చేయకుండా రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాకి అనుకున్న రేంజ్లో ఓపెనింగ్స్ రావడం లేదు. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.30 cr |
| సీడెడ్ | 0.14 cr |
| ఉత్తరాంధ్ర | 0.29 cr |
| ఈస్ట్ | 0.73 cr |
‘మదగజరాజ’ (Madha Gaja Raja ) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ 5 రోజులు ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.0.73 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.77 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంత టార్గెట్ ను రీచ్ అవ్వడం అంటే ఇప్పుడు కష్టమే అని చెప్పాలి.













