తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ ‘మదరాసి’ ఈ సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యింది. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ వంటివి బజ్ క్రియేట్ చేయలేదు,పైగా మురుగదాస్ గత సినిమాలు కూడా ప్లాప్ అవ్వడంతో.. ఆడియన్స్ కి మొదటి నుండి ఈ ప్రాజెక్టుపై ఆసక్తి లేదు అనే చెప్పాలి.
తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఇంతే.అందుకు తగ్గట్టే మొదటి రోజు ప్లాప్ టాక్ వచ్చింది. మొదటి రోజు కొంత పర్వాలేదు అనిపించినప్పటికీ 2వ రోజు నుండి ‘మదరాసి’ ఓపెనింగ్స్ పడిపోయాయి. ఆ తర్వాత కోలుకుంది అంటూ ఏమీ లేదు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.20 cr |
సీడెడ్ | 0.36 cr |
ఉత్తరాంధ్ర | 0.38 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.17 cr |
కృష్ణా + గుంటూరు | 0.36 cr |
నెల్లూరు | 0.10 cr |
ఏపి+ తెలంగాణ(టోటల్) | 2.57 cr(షేర్) |
‘మదరాసి’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.9.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం ఈ సినిమా కేవలం రూ.2.57 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.5 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.7.43 కోట్ల షేర్ ను రాబట్టాలి.