కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ మలయాళం వంటి దాదాపు 7 భాషలలో నటించిన మాధవన్ హీరోగా విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మాధవన్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. దీంతో ఈయన తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాలో విలన్ గా నటించాడు.
ఇదిలా ఉండగా మాధవన్ స్వీయ దర్శకత్వం తెరకెక్కిన సినిమా ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా జూలై 1న పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నంబి నారాయణన్ పాత్రలో నటించిన మాధవన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ డేట్ గురించి సినిమా యూనిట్ అప్డేట్ ఇచ్చింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‌లో ఈ రాకెట్రీ మూవీస్ట్రీమింగ్ కానుంది. జూలై 26 నుండి తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా మేకర్స్ మరోక పోస్ట్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా మంచి వసూళ్లు కూడా సాధించింది. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ఈ సినిమాకి మాధవన్ స్వీయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నంబి నారాయణన్ సాధించిన విజయాలు, అతని పై చేసిన తప్పుడు ఆరోపణలు గురించి అతను నిర్దోషి అని నిరూపించుకోవడానికి చేసిన పోరాటాన్ని రాకెట్రీ సినిమాలో చక్కగా చూపించారు. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లు వసూళు చేసినట్లు సినీ వర్గాల అంచనా.