రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన నచ్చావులే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు నటి మాధవీలత. ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం నాచురల్ స్టార్ నాని సరసన స్నేహితుడా అనే సినిమాలో నటించి మంచిపేరు సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమా అనంతరం మాధవీలత పెద్దగా సినిమాలలో నటించ లేకపోయారు. తెలుగమ్మాయి కావడంతో దర్శకులు ఈమెను పూర్తిగా పక్కన పెట్టడంతో మాధవీలత సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ విధంగా బీజేపీ పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. గత ఎన్నికలలో భాగంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.ఇకపోతే ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న ఈమె సినిమాలలో నటించకపోయినా సినిమా ఇండస్ట్రీ గురించి సోషల్ మీడియా వేదికగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె రీ ఎంట్రీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ తనకు గతంలో అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం కల్పించారు. అయితే ఆ సమయంలో తాను వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ పాటలో నటించలేక పోయానని ఈ పాట కోసం ఐదు లక్షల రెమ్యూనరేషన్ చెల్లిస్తామని తెలిపినట్లు ఈమె వెల్లడించారు. ఈ సినిమా అనంతరం తనకు పలు సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసే అవకాశం వచ్చినా తాను ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడలేదని తెలిపారు.
అయితే తనకు విలన్ పాత్రలో నటించాలని చాలా ఆసక్తిగా గా ఉందని నటి వరలక్ష్మి నటిస్తున్నటువంటి పాత్రలలో విలన్ గా నటించాలని ఆసక్తి ఉందని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు. దీంతో తనకు విలన్ గా అవకాశాలు వస్తే తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మాధవీలత ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.