మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నటుడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదని చెప్పాలి. ఇలా నటుడిగా కెరియర్ లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అయ్యారు.
ఇలా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందడమే కాకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాలన్నింటినీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుత ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ కెరియర్లో ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా సాధించలేనటువంటి రికార్డు ఒక సినిమా సాధించింది. ప్రస్తుత కాలంలో ఒక సినిమా విడుదలైతే థియేటర్లలో రెండు వారాల పాటు కొనసాగడం గగనం అలాంటిది రాంచరణ్ సినిమా ఏకంగా వెయ్యి రోజులపాటు థియేటర్లలో ప్రదర్శనమౌతూ సంచలనం సృష్టించింది.
ఇలాంటి ఓ గొప్ప రికార్డు అందుకున్నటువంటి హీరోగా రామ్ చరణ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ నటించిన ఏ సినిమా ఇలా వెయ్యి రోజులు పైగా థియేటర్లలో ఆడిందనే విషయానికి వస్తే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమా కర్నూలులోని ఓ థియేటర్ లో 1002 రోజులు ఆడి రికార్డుల్లోకి ఎక్కింది. (Magadheera) ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే ఎప్పటికీ ఒక బెస్ట్ సినిమా అని చెప్పాలి.