రాజమౌళి ఇప్పుడు ఎంత పెద్ద సినిమాలు తీస్తున్నా.. ఆయన కలల ప్రాజెక్ట్ ముందు ఇవి చాలా చిన్నవే అని చెప్పొచ్చు. ఈ మాట మేం చెప్పడం కాదు. ఆయన తన కలల ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పటి నుండి ఎవరైనా సరే ఇదే మాట అంటున్నారు. అదే ‘మహా భారతం’. ఈ సినిమా గురించి రాజమౌళి చెప్పడం ఆలస్యం.. ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేయండి చూడటానికి మేం రెడీ అని ఫ్యాన్స్, చేయడానికి మేం రెడీ అని స్టార్స్ సిద్ధమయ్యారు. కానీ ఆయన లేటెస్ట్ మాటలు వింటుంటే.. అదంత ఈజీ కాదు అని అర్థమవుతోంది.
అంటే.. ఈ సినిమా రావడం కష్టం అని కాదు. ఇప్పుడున్న స్టార్లు, ఇప్పుడున్న వారు చూడటం అని. ఎందుకంటే ఈ సినిమా గురించి రాజమౌళి ఆలోచనలు అలా ఉన్నాయి మరి. భారతీయ ఇతిహాసగాథ ‘మహాభారతం’ ఎప్పటికైనా తీస్తానని అనేక సందర్భాల్లో తెలిపారు. తాజాగా ‘మహాభారతం’ తీస్తే బహుశా పది భాగాలు, ఇంకా చెప్పాలంటే అంతకుమించి ఉండొచ్చు అని చెప్పారు. ‘మహా భారతం’ను సినిమాగా తీయాలంటే దేశంలో అందుబాటులో ఉన్న అన్ని వెర్షన్స్ చదవాలి. దానికే ఏడాదిపైన పడుతుంది.
గతంలోనూ ‘మహాభారతం’ గురించి రాజమౌళి (Rajamouli) మాట్లాడుతూ ఆ సినిమా కోంస చాలా సమయం పడుతుంది. అంతకన్నా ముందు నాలుగైదు సినిమాలు తీస్తానేమో అన్నారు. ప్రస్తుతం రాజమౌళి ఒక సినిమా తీయాలంటే దాదాపు మూడేళ్లు పైనే పడుతోంది. ఈ లెక్కన మహాభారతం స్టార్ట్ అవ్వడానికి పదేళ్లు పడుతుంది. అక్కడి నుండి 10 భాగాలు అంటే సుమార 30 ఏళ్లు అనుకోచ్చు. స్పీడ్‌గా చేస్తే 20 ఏళ్లు అనుకుందాం.
ఆ లెక్కన ఇప్పటి స్టార్లకు ఆ సినిమాలో ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అన్ని భాగాల్లో చేయలేరు. ఈ లెక్కన ఇప్పటి స్టార్లు, ఇప్పటి సీనియర్లకు ఈ సినిమా మొత్తం చూడటం కష్టమే అంటున్నారు. ఒకవేళ రాజమౌళి చాలా వేగంగా సినిమాలు పూర్తి చేస్తే అప్పుడు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మరి ఆయనేం చేస్తారో చూడాలి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?