ఆమె నా లావు చూడలేదు.. మనసు చూసింది.. కానీ ఆ కండిషన్ పెట్టింద: నిర్మాత రవీందర్

  • September 8, 2022 / 02:37 PM IST

ఈ మధ్యనే ఓ నటి, నిర్మాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే..! వీరి మొదటి పెళ్లి కాన్సిల్ అయ్యింది. ఇద్దరూ మొదటి భాగస్వామితో విడిపోయారు. చాలా కాలంగా ఒంటరిగా జీవిస్తూ వస్తున్నారు. అందుకే రెండో పెళ్లి చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. వీళ్ళే విజె మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ శంకర్.వారం రోజులుగా ఈ జంట పెళ్లి టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే నిర్మాత రవీందర్ భారీ ఖాయంతో కనిపిస్తున్నాడు.

దాంతో డబ్బు కోసమే మహాలక్ష్మి ఇతన్ని పెళ్లి చేసుకుంది అంటూ రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా రవీందర్ నిర్మిస్తున్న ఓ సినిమాలో మహాలక్ష్మి నటిస్తుంది. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది అని చెప్పాలి. ఏదేమైనా పెళ్లి తర్వాత ఈ జంట దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇదే క్రమంలో రవీందర్.. తమ పై వస్తున్న ట్రోల్స్ మరియు ఊహాగానాల పై స్పందించాడు.

అతను మాట్లాడుతూ.. ” మా పెళ్లి పై వస్తున్న ట్రోల్స్ చూస్తూనే ఉన్నాం. మహాలక్ష్మి నేను పరస్పర అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాం. ఆమె నా లావుని చూడలేదు. నా మనసు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంది. అలాగే పిల్లల విషయంలో ఆమె కండిషన్ పెట్టినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. కానీ మా ప్రేమకి గుర్తు పిల్లలు కావాలని ఆమెనే కోరింది. ఆమె డబ్బు మనిషి కాదు” అంటూ రవీందర్ చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus