మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జనవరి 11న విడుదల కాబోతుంది. చాలా రోజుల తర్వాత మహేష్ ఓ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు కాబట్టి.. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. సాధారణంగా ప్రయోగాత్మక చిత్రాలకి ‘కేర్ ఆఫ్ అడ్రెస్’ అంటే.. మహేష్ బాబు పేరే చెప్తారు. అప్పట్లో డైరెక్టర్లందరూ మహేష్ పై ప్రయోగాలు చేసి.. అతన్ని ముంచేశారు. ఇక అభిమానులు ఓ దశలో బాగా నిరుత్సాహ పడ్డారు.
ఇదిలా ఉంటే.. ఈరోజుతో ‘1 నేనొక్కడినే’ సినిమా వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. ఈ చిత్రం 2014 సంక్రాంతికి విడుదలై పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ చిత్రం అంత ప్లాప్ అవ్వడానికి మహేష్ అభిమానులే అని కొంతమంది కామెంట్లు చేస్తుంటారు. అభిమానులు కొంతకాలం వరకే సినిమాని మేనేజ్ చేయగలరు. కానీ ఆ సినిమా వచ్చిన టైం కరెక్ట్ కాదని ఫిలిం విశ్లేషకులు చెప్తుంటారు. ఫలితం ఎలా ఉన్నా.. ‘1 నేనొక్కడినే’ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రమోషన్లలో మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రం పై స్పందించాడు.. ” ‘1 నేనొక్కడినే’ సినిమాకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ప్రయోగాత్మక చిత్రాలు అనుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు. టాలీవుడ్ లో పెద్ద హీరోలమంతా ఓ విచిత్రమైన జోన్లో ఉన్నాం. ఆ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమా చేయాలంటే ఎంతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.నిర్మాత 100 కోట్లు పెట్టి సినిమా తీస్తారు. బయ్యర్లు మమ్మల్ని నమ్మి సినిమా కొంటారు. అలాంటప్పుడు మేము ప్రయోగాల పేరుతో సినిమాలు చేస్తే లాస్ లు వస్తాయి. ఒక వేళ ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకుంటే అన్ని అంశాలు కుదిరాక తక్కువ బడ్జెట్ లో తీసుకుంటే బెటర్ అని నాకు తెలిసొచ్చింది. ఎటువంటి ప్రయోగం చేసినా అభిమానులకి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి… తరువాత నేను.. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయబోయే సినిమా కూడా కమర్షియల్ ఎలెమెంట్స్ తోనే ఉంటుంది” అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు.