Mahesh Babu: పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్.. మహేష్ ఎందుకు స్టార్ట్ చేశాడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వీలైనంత వరకు ఎక్కువగా సినిమాలతోనే బిజీగా ఉంటాడు. ఇక ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా ఎక్కువగా తన కుటుంబ సభ్యులతో ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. అయితే మహేష్ బాబు పలు సామాజిక సేవల విషయంలో కూడా ముందుంటాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నుంచి రావాల్సిన ఏదైనా సహాయం ఉంది అంటే వెంటనే స్పందిస్తాడు. ఇక మహేష్ బాబు గత కొన్ని ఏళ్లుగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్న విషయం తెలిసిందే.

వెయ్యి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించిన మహేష్ బాబు అసలు ఈ మంచి పనికి పూనుకోవడానికి అసలు కారణం ఏమై ఉంటుంది అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక ఇటీవల మహేష్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. గౌతమ్ ఆరు వారాల కంటే ముందే జన్మించాడట. పుట్టగానే నా హ్యాండ్ అంత ఉన్నాడని చెప్పిన మహేష్ ఇప్పుడు ఆరు అడుగులు ఉన్నట్లు తెలియజేశారు. ఇటీవల బాలకృష్ణ అన్ స్థాపబుల్ షోలో పాల్గొన్న మహేష్ ఈ విషయాన్ని తెలియజేశాడు.

మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి గౌతమ్ ను కాపాడుకున్నాం. మరి డబ్బులు లేని వారి పిల్లల సంగతేంటి అనే ఆలోచన నాకు చాలాసార్లు వచ్చింది అని మహేష్ అన్నాడు. ఇక అప్పటి నుంచి చిన్నారుల ప్రాణాలు కాపాడే విధంగా ఏదైనా చేయాలని అనుకుని ఈ పని మొదలు పెట్టినట్లుగా మహేష్ వివరణ ఇచ్చారు. ఇక మహేష్ అలా చెప్పగానే బాలకృష్ణ కూడా గొప్పగా ప్రశంసలు కురిపించారు. మొత్తంగా మహేష్ ఇప్పటివరకు 1058 మంది చిన్నారులకు గుండె సంబంధిత శాస్త్ర చికిత్సలు చేయించారు.

ఇక షోలోకి మహేష్ ద్వారా సహాయం అందుకున్న వారు కూడా వచ్చారు. తల్లిదండ్రులు మహేష్ బాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక షోలోకి మరో ప్రత్యేక అతిథిగా మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా రావడం జరిగింది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus