సూపర్ స్టార్ మహేష్ కి సామాజిక బాధ్యత కొంచెం ఎక్కువే. తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. మహేష్ ఇప్పటికే దాదాపు వెయ్యికిపైగా పసిపిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించారు. అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు గ్రామాలు దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలు సమకూర్చడం జరిగింది. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా అనేక ప్రజాహిత సందేశాలు పంచుకుంటారు. కాగా నేడు ప్రపంచ సహజవనరుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ట్విట్టర్ లో ఓ సందేశం పోస్ట్ చేశారు.
ఆ సందేశం ద్వారా సహజ వనరుల పరిరక్షణ సమాజానికి ఎంత అవసరమో తెలియజేశారు. నీటిని వినియోగం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, పొదుపు చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ సమర్ధవంతంగా నిర్వహించాలి అన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు స్పృహతో మెలగాలన్నారు. అలాగే మార్పు మన ఇంటి నుండే మొదలుకావాలి, సహజ వనరులను పరిరక్షించాలని ఆయన తన సందేశంలో పేర్కొనడం జరిగింది. మహేష్ లాంటి టాప్ స్టార్ ఇలాంటి మంచి విషయాలపై అవగాహన కల్పించడం ఖచ్చితంగా మేలు చేసే అంశమే.
కాగా మహేష్ సెప్టెంబర్ నుండి, తన కొత్త చిత్రం సర్కారు వారి పాట షూట్ లో పాల్గొననున్నారు. దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Save water, recycle, manage waste, use renewable energy, reduce plastic usage. Choose one to start!! While we protect ourselves during this global crisis, let’s remember to conserve and protect nature too. Change begins at home! 🌍🌳🍃#WorldNatureConservationDaypic.twitter.com/d8wS558ybJ