Mahesh Babu, Allu Arjun: ఎటువంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న స్టార్స్..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికలు హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌పై యువ హీరో మంచు విష్ణు విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రౌడీయిజం రాజ్యమేలిందని ప్రకాశ్ రాజ్ వర్గం ఆరోపణలు చేసింది. అంతేనా తన ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది చేత రాజీనామా చేయించారు. తనపై మోహన్ బాబు చేయిచేసుకోబోయారని.. బూతులు తిట్టారని బెనర్జీ, తనీష్‌లు కంటతడి పెట్టడం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడిన తరుణంలో కొందరు టాప్ స్టార్లు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మా ఎన్నికల్లో కొందరు ఓట్లు వేయకపోవడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలు, షూటింగ్‌లతో కొందరు ఎన్నికలకు దూరమైతే.. హైదరాబాద్‌లో పోలింగ్ కేంద్రానికి కూతవేటు దూరంలో వుండి కూడా ఓటు వేయని స్టార్లు కూడా వున్నారు.ఇకపోతే మహేష్ .. సర్కార్‌వారి పాట షూటింగ్ నిమిత్తం స్పెయిన్‌లో బిజిబిజీగా గడుపుతున్నారు.

కాస్త విరామం దొరికినా కుటుంబంతో గడిపే మహేశ్.. స్విట్జర్లాండ్‌లో భార్యాపిల్లలతో స్విమ్మింగ్‌‌పూల్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. మరో స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. అతను మాల్దీవుల్లో పిల్లలతో సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తూ గడుపుతున్నాడు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus