Mahesh Babu, Sitara: సితారతో కలిసి టీవీ షోలో సందడి చేసిన మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేష్ బాబు బుల్లితెరపై సందడి చేయనున్నారు. తన కూతురితో కలిసి ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతోన్న ‘డాన్స్ ఇండియా డాన్స్’ ప్రీమియం రియాలిటీ షోకి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. కూతురితో కలిసి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఈ ప్రోమోలో సితార ‘పెన్నీ’ సాంగ్ కి స్టెప్పులేస్తూ కనిపించింది. నిజానికి మహేష్ బాబు ఇలాంటి షోలకు దూరంగా ఉంటారు.

ఒకట్రెండు రియాలిటీ షోలలో పాల్గొన్నారు కానీ ఈసారి డాన్స్ షోకి గెస్ట్ గా వచ్చారు. దీనికోసం ఆయన మొత్తం రూ.9 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క షోకి ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదు. మహేష్ ని గెస్ట్ గా తీసుకొచ్చి షోపై హైప్ తెచ్చే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. మరి ఆశించిన స్థాయిలో ఈ షో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే..

ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హీరో ప్రస్తుతం త్రివిక్రమ్ తో కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఈ ఏడాది చివరికి షూటింగ్ పూర్తి చేసిన ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. పీఎస్ వినోద్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus