సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల మరో యాడ్ షూట్‌లో కనిపించడం అభిమానుల్లో కొత్త చర్చలకు దారితీసింది. ఆయన నటిస్తున్న “SSMB29” సినిమాకి సంబంధించిన అధికారిక షూటింగ్ ప్రారంభం ఇంకా లేటవుతోందా? అనేలా ఆసక్తికరమైన సందేహాలు తెరమీదకు వచ్చాయి. ఇటీవల మహేష్ బాబు అన్నపూర్ణ స్టూడియోలో ఆకుపచ్చ టీ-షర్ట్, కూల్ లుక్‌లో యాడ్ షూట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటో చూసి అభిమానులు మహేష్ స్టైల్‌ను పొగిడేస్తున్నారు.
అయితే ఇది రాజమౌళి (S. S. Rajamouli) ప్రాజెక్ట్ ఆలస్యానికి సంకేతమా? అన్నది ఆసక్తికరం. రాజమౌళి రూపొందిస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం మహేష్ ప్రత్యేకమైన లుక్‌లో కనిపిస్తారని సమాచారం. అయితే సాధారణంగా రాజమౌళి సినిమాల షూటింగ్ ప్రారంభమయ్యాక హీరోలు ఇతర పనుల్లో పాల్గొనరు. ఈ నేపథ్యంలో మహేష్ యాడ్ షూట్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆల్యూమినియం ఫ్యాక్టరీలో SSMB29 పూజ కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ క్లారిటీ లేదు.
ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. కాగా, జక్కన్న సినిమాలకు కసరత్తులు, వర్క్‌షాప్‌లు ఎక్కువగా జరుగుతాయని తెలిసిందే. బహుశా ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తిగా సెట్స్ పైకి రాలేదేమో అన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ ఈ మధ్య యాడ్ షూట్ల ద్వారా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
ఆయన నటిస్తున్న యాడ్స్ మార్కెట్‌లో హై డిమాండ్ కలిగినవి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న న్యూ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కారణంగా మహేష్ ప్రస్తుతం యాడ్ షూట్స్‌తో తన టైమ్‌ను యుటిలైజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి షూటింగ్ ఎప్పుడు పూర్తి స్థాయిలో స్టార్ట్ చేస్తారో చూడాలి.