Mahesh Babu, Sitara: కూతురి ఇష్టాన్ని కాదననని చెప్పిన మహేష్.. కానీ?

టాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా తగినంత సమయం కేటాయించే హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే గతంలో సితార సినిమాల్లోకి వస్తారా? రారా? అనే ప్రశ్నకు మాత్రం మహేష్ సమాధానం చెప్పేవారు కాదు.

సితార యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు సితారకు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సితార సినిమాల్లో నటిస్తే చూడాలని మహేష్ అభిమానులలో చాలామంది కోరుకుంటున్నారు. తాజాగా ఒక ప్రోగ్రామ్ లో మహేష్ మాట్లాడుతూ సితారతో కలిసి నటించాలంటే తనకు నెర్వస్ గా ఉందని చెప్పుకొచ్చారు. సితారకు ఇంగ్లీష్ సినిమాలలో నటించాలని ఉందని మహేష్ కామెంట్లు చేశారు. సితార తెలుగు సినిమాలు చేయదని మహేష్ బాబు చెప్పకనే చెప్పేశారు.

మహేష్ బాబు తాను పిల్లల ఇష్టాలను కాదననని చదువు పూర్తైన తర్వాత సితార సినిమాల్లోకి వస్తానంటే కాదననని అన్నారు. పిల్లలతో బలవంతంగా ఏ పని చేయనివ్వనని పిల్లలను ఇష్టమైన మార్గంలో నడవమని చెబుతానని మహేష్ చెప్పుకొచ్చారు. సితార సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది. సర్కారు వారి పాట భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మహేష్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని భావిస్తున్నారు. సర్కారు వారి పాట ఏ రేంజ్ హిట్టవుతుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Share.